సూపర్:3వరోజు గుంటూరు కారం సినిమా కలెక్షన్స్ మహేష్ స్టామినా నిరూపించారుగా..!!
ఇక రెండవ రోజు రూ .33 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది.. మూడవరోజు రూ .37 కోట్ల రూపాయలు రాబట్టి పూర్తిగా మూడు రోజుల్లోనే రూ .164 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ను రాబట్టింది.. రూ .80 కోట్లకు పైగా షేర్ పట్టడం గమనార్హం అని చెప్పవచ్చు. ఈ సినిమా రూ .132 కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరగగా ఇంకా బ్రేక్ ఈవెన్ రాబట్టాలి అంటే రూ .50 కోట్ల రూపాయలను రాబట్టాల్సి ఉన్నది..
ఇదంతా ఇలా ఉండగా రెండో రోజు కంటే మూడో రోజు కలెక్షన్స్ కూడా భారీగా పెరిగిపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ఆదివారం రోజున విడుదలైన నా సామి రంగ సినిమా విడుదలైనప్పటికీ కలెక్షన్స్ తగ్గాలి కానీ ఇప్పుడు గుంటూరు కారం సినిమాకు కలెక్షన్స్ పెరగడంతో పాటు పాజిటివ్ టాక్ పెరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..గుంటూరు కారం సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు.. ఏది ఏమైనా మహేష్ సినిమాకి కావాలని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసినప్పటికీ తన స్టామినాతో ఇంతలా కలెక్షన్స్ ని రాబడుతున్నారని అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఎంతటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి మరి.