రాం చరణ్ కోసం దీపికాని దించుతున్నారా..?
ఈ సినిమా లో హీరోయిన్ గా మరో బాలీవుడ్ భామని దించుతున్నారని తెలుస్తుంది. ఫిల్మ్ నగర్ సర్కిల్స్ ప్రకారం బుచ్చి బాబు చరణ్ కాంబోలో దీపికా పదుకొనెని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట. ఆల్రెడీ ప్రభాస్ తో కల్కి సినిమాలో దీపిక నటిస్తుంది. ఈ సినిమా తర్వాత మరో తెలుగు సినిమాకు దీపికా సైన్ చేయనుందని తెలుస్తుంది.
చరణ్ తో దీపికా అంతకుముందే డిస్కషన్స్ లో ఉన్నా అది కుదరలేదు. ప్రియాంక చోప్రాతో జంజీర్ చేసే టైం లోనే దీపికా ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారు కానీ అది కుదరలేదు. మళ్లీ ఇన్నేళ్లకు దీపికతో చరణ్ రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. కల్కితో సౌత్ ఆడియన్స్ ని ఆకట్టుకునేందుకు వస్తున్న దీపికా చరణ్ సినిమాతో కూడా అలరిస్తుందని చెప్పొచ్చు. సౌత్ సినిమాల్లో కూడా తన ముద్ర వేయాలని చూస్తున్న దీపికా పదుకొనె కల్కితో పాటు ఇక మీదట ఇక్కడ ఆఫర్లను కూడా ఓకే చేయాలని అనుకుంటుంది. తప్పకుండా దీపికాకు తెలుగులో కూడా స్టార్ రేంజ్ దక్కించుకుంటుందని చెప్పొచ్చు. కల్కితో పాటు మరికొన్ని సినిమాలు కూడా దీపిక ఖాతాలో రావాలని చూస్తున్నారు.