ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన ప్రశాంత్ వర్మ ....!!

murali krishna
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రశాంత్ వర్మ తనదైన ప్రతిభ చూపిస్తూ ముందుకు కదులుతున్నాడు. ఇక ఇప్పటికే ఈయన హనుమాన్ సినిమా తో మంచి విజయాన్ని అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకత ను అయితే చాటుకున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయన చేయబోయే సినిమా మీద చాలా వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం అయితే ఈయనకు స్టార్ హీరో లతో సినిమాలు చేసే అవకాశాలు వస్తున్నాయి. అందులోనూ బాలయ్య బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోల నుంచి కూడా మంచి అవకాశాలు వస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈయన ఇప్పుడు ఎవరితో సినిమాలు చేస్తాడు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.ఈయన ఒక్క హనుమాన్ సినిమా తోనే ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.అందుకే ఇపుడు ప్రశాంత్ వర్మ చేసే నెక్స్ట్ సినిమా మీదనే అందరి దృష్టి ఉంది. అందులో భాగం గానే ఆయన ఎవరి తో సినిమా చేసిన కూడా ఆ సినిమా సూపర్ సక్సెస్ అయ్యే విధంగా దాన్ని తెరకెక్కించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక తన దగ్గర ఉన్న అన్ని కథలు కూడా చాలా పవర్ ఫుల్ కథలని ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో ఆయన తెలియజేశాడు.మరి ఆ కథలని ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఆయన హనుమాన్ సినిమాని అయితే చాలా సెన్సిటివ్ గా హ్యాండిల్ చేశాడు.   అలాగే దైవత్వానికి ఎక్కడ కూడా భంగం కలగకుండా తను చూపించాల్సిన సీన్లని చూపిస్తూ దేవుడిని కూడా చాలా గొప్పగా చూపించాడు. దీంతో ఆది పురుష్ సినిమా మీద చాలా విమర్శలు అయితే వస్తున్నాయి.ఎందుకంటే ఒక పౌరాణికానికి సంబంధించిన సినిమా తీయాలంటే ఇలా తీయాలి కానీ ఆడి పురుష్ సినిమా లాగా కాదు అంటూ ఆ సినిమా డైరెక్టర్ అయిన ఓం రావత్ ని విపరీతం గా ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: