అఖిల్ నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఇంతకీ డైరెక్టర్ ఎవరో తెలుసా?
కానీ ఇప్పటివరకు ఈ అక్కినేని హీరో తన కెరీర్ లో ఒక్క సాలిడ్ హీట్ కూడా కొట్టలేకపోయాడు అని చెప్పాలి. ఎన్నో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డిజాస్టర్ లతో డీల పడిపోతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక అఖిల్ కెరియర్ లో చెప్పుకోదగ్గ సినిమా ఏదైనా ఉంది అంటే ఓ మోస్తారు విజయాన్ని సాధించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాత్రమే అని చెప్పాలి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఏజెంట్ సినిమా అఖిల్ కెరీర్ ని మరింత దెబ్బ కొట్టింది. అయితే ఏజెంట్ డిజాస్టర్ తర్వాత అఖిల్ నెక్స్ట్ సినిమా ఎవరితో అన్న విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది.
అయితే హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ లో ఒక సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయబోతున్నాడు అఖిల్ అంటూ ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు వరకు దీని గురించి అధికారిక ప్రకటన రాలేదు. అయితే యు వి క్రియేషన్స్ బ్యానర్ మీద అఖిల్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యానర్ లో మెగాస్టార్ హీరోగా విశ్వంభరా అనే సినిమా తెరకెక్కుతోంది. అయితే విశ్వంభరా సినిమాకు సంబంధించి ఒక టైటిల్ కాన్సెప్ట్ వీడియోని విడుదల చేయగా.. ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ వీడియో రెడీ చేసిన వ్యక్తి పేరు అనిల్ కుమార్ ఉపాధ్యాయుల. అయితే అఖిల్ తో ఆయన సినిమా చేయబోతున్నాడట. గతంలో ప్రభాస్ మూవీస్ సాహూ, రాధేశ్యామ్ సినిమాలకు ఆయన పని చేశాడు. ఇక ఇప్పుడు అఖిల్ తో సినిమాకు రెడీ అయ్యాడట అనిల్ కుమార్ ఉపాధ్యాయుల.