టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా రూపొందిన నా సామి రంగ అనే సినిమా జనవరి 14 వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్ లను వసూలు చేసింది. అందులో భాగంగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసింది అనే వివరాలను తెలుసుకుందాం.
ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు నైజాం ఏరియాలో 1.18 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా , సిడెడ్ ఏరియాలో 85 లక్షలు , ఉత్తరాంధ్రలో 50 లక్షలు , ఇస్ట్ లో 60 లక్షలు , వెస్టు లో 30 లక్షలు , గుంటూరు లో 46 లక్షలు , కృష్ణ లో 23 లక్షలు , నెల్లూరు లో 18 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.30 కోట్ల షేర్ , 6.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ మూవీ మొదటి రోజు కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 20 లక్షల కలెక్షన్ లను వసూలు చేయగా , ఓవర్ సీస్ లో 20 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 4.70 కోట్ల షేర్ , 7.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 18.20 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఈ మూవీ 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారి లోకి దిగింది. ఈ మూవీ మరో 14.30 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ గా నిలుస్తుంది.