గుంటూరు కారం: బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతున్న బాబు?

Purushottham Vinay
వరుస హిట్లతో టాలీవుడ్ టాప్ హీరోగా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్ల అదరగోడుతుంది.ఇప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను ఈ సినిమా నమోదు చేస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇప్పటిదాకా ఈ సినిమా 103 కోట్ల పైగా షేర్ 206 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్టు సమాచారం తెలుస్తుంది. ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా లైక్ చేయడంతో వసూళ్లు అమాంతం పెరిగిపోతున్నాయి. ఏపీ, ఆంధ్రాల్లో కొన్ని చోట్ల ఆర్ ఆర్ ఆర్ రికార్డులని కూడా ఈ సినిమా బద్దలు కొట్టింది. ఆశ్చర్యంగా చెన్నై బెంగళూరు వంటి సిటీల్లో కూడా ఈ సినిమాకి వసూళ్లు వస్తున్నాయి.చెన్నై లో అయితే స్ట్రాంగ్ వసూళ్లు వస్తున్నాయి. కానీ తమిళ వెర్షన్ మాత్రం ఓటిటిలో విడుదల అవ్వనుంది.ఈ సినిమా విడుదల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు యూనిట్‌ సభ్యులకు పార్టీ ఇచ్చాడు.



అదే సమయంలో యాంకర్ సుమ కి హీరోయిన్ శ్రీలీలతో కలిసి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో మహేష్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమాలోని విషయాలను ఇంకా సినిమా వెనుక జరిగిన సంఘటనల గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు చెప్పుకొచ్చాడు.ఈ సినిమాలో మహేష్ బాబు ఎక్కువ సన్నివేశాల్లో బీడీ తాగినట్లు గా చూపించారు.ఆ విషయమై ఆయన స్పందిస్తూ.. అది నిజమైన బీడీ కాదని, అది ఆయుర్వేదిక్‌ ఆకులతో తయారు చేసిందని అన్నాడు.పైగా అది ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగించదు అన్నట్లుగా సూపర్ స్టార్ మహేష్ బాబు పేర్కొన్నాడు. ఇక ఈ ఏడాది చివర్లో మహేష్‌, జక్కన్న సినిమా మొదలు అవ్వబోతుంది. 2026 లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఇక గుంటూరు కారంతో పాటు విడుదల అయిన హనుమాన్ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టుతో దూసుకుపోతుంది. ఈ సినిమా కూడా 100 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ముఖ్యంగా నార్త్ ఇండియా, నార్త్ అమెరికాలో ఈ సినిమా సాలిడ్ వసూళ్లతో దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: