ట్రైలర్: కెప్టెన్ మిల్లర్ తెలుగు ట్రైలర్ రిలీజ్.. ధనుష్ మరో బ్లాక్ బస్టరే..!!
విడుదలైన నాలుగు రోజులలోనే కేవలం రూ.50 కోట్ల రూపాయల కలెక్షన్స్ ను రాబట్టింది.. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయాలని చిత్ర బృందం భావించగ ఈనెల 25వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అందుకు సంబంధించి ట్రైలర్ ని కూడా వెంకటేష్ చేతుల మీదుగా విడుదల చేశారు.. ఈ ట్రైలర్ పరిశీలిస్తే తెల్లదొరలోకి దొంగవి అనే బ్యాగ్రౌండ్ తో వచ్చే డైలాగ్ తో ఈ ట్రైలర్ మొదలవుతుంది.. ఇందులో హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా చాలా వైలెంట్ గా కనిపిస్తోంది.
సందీప్ కిషన్ కూడా ఈ సినిమా ట్రైలర్ మొదటిలోనే కనిపిస్తారు. ధనుష్ బ్రిటిష్ సైనికుల మధ్య జరిగే ఫైట్స్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి.. ముఖ్యంగా బ్రిటిష్ పరిపాలకులు అమాయకులైన ప్రజల్ని చిత్రహింసలు పెట్టడం వల్ల ధనుష్ వారికి వ్యతిరేకంగా ఊరిలోనే కొంతమంది దళంతో ఏర్పడి పోరాడే సన్నివేశాలను ట్రైలర్లు చూపించారు..ధనుష్ మిషన్ గన్ చేతిలో పట్టుకొని చెప్పే డైలాగ్ ఈ ట్రైలర్ కి హైలైట్ గా కనిపిస్తోంది. ధనుష్ ఈ ట్రైలర్లో మూడు గెటప్పులకు పైగా కనిపిస్తున్నారు.. శివన్న కూడా ఇందులో విభిన్నమైన పాత్రలో కనిపించినట్టు తెలుస్తోంది. మరి మొత్తానికి ధనుష్ ఈసారి కూడా ఈ సినిమాతో హిట్టు కొట్టేలా కనిపిస్తున్నారు.