రాంచరణ్ గూర్చి క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ వశిష్ట....!!
తాజా ఇంటర్వ్యూలో వశిష్ఠ మాట్లాడుతూ .. చాలా విషయాల్లో క్లారిటీ ఇచ్చాడు. బింబిసార' సినిమాతో కల్యాణ్ రామ్ అవకాశం ఇవ్వడం వల్లనే నేను ఇక్కడ ఉన్నాను. కాకపోతే సీక్వెల్ మాత్రం నేను చేయడం లేదు అన్నారు. బింబిసార 2' విషయానికి వచ్చేసరికి నా ఐడియాలజీ వేరేగా ఉంది. అంతలో నాకు మెగా స్టార్ ప్రాజెక్టు చేసే ఛాన్స్ కూడా వచ్చింది అన్నారు.అయితే బింబిసార సీక్వెల్ విషయంలో నాకు కల్యాణ్ రామ్ గారికి మధ్య గ్యాప్ వచ్చింది అని చాలా మంది ప్రచారం చేశారు.. కాని నాకు మెగా ప్రాజెక్ట్ రావడంతో.. నేను కల్యాణ్ రామ్ గారి అనుమతి తీసుకునే బయటికి వచ్చాను. అంతే తప్ప మా మధ్య ఎలాంటి సమస్య రాలేదు అన్నారు. ఇక తను మాట్లాడిన మాటలు చాలామంది వక్రీకరిస్తున్నారన్నారు వశిష్ట.చిరంజీవిగారితో ఫాంటసీ మూవీ చేయాలని ఉందంటే, దానిని తమకు అనుగూణంగా మార్చి.. వేరేగా రాశారు" అని అన్నాడు.
ఇక రామ్ చరణ్ విషయంలో కూడా తాను అనని విషయం సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది అన్నారు వశిషప్ట. చరణ్ తో నేను 'బాహుబలి' లాంటి సినిమా చేస్తానని అన్నట్టుగా కూడా చాలామంది రాసుకొచ్చారు. కానీ ఏ ఇంటర్వ్యూలో కూడా ఆ మాట అనలేదు. కావాలని చెప్పి కొంతమంది అలా పుకారు పుట్టించారంతే. మొదటి నుంచి కూడా నాకు ఫాంటసీ కంటెంట్ అంటే ఇష్టం. అందువల్లనే అలాంటి కథతోనే సెట్స్ పైకి వెళ్లాను అని మబ్బులు విడిపోయేలా.. క్లారిటీ ఇచ్చాడు యంగ్ డైరెక్టర్.