నిరాహారదీక్ష చేసి మరీ కృష్ణంరాజు గారి పెళ్లి చేసారంటున్న శ్యామలాదేవి.....!!

murali krishna
కృష్ణంరాజు రెండో భార్య శ్యామలాదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కృష్ణంరాజు తన సినీ కెరీర్ లో ఎన్నో విజయాలను ఖాతా లో వేసుకున్నారు.ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లను చేయించడం తో పాటు ఎన్నో తెలుగు సినిమా లలో నటించి విజయాలను సొంతం చేసుకున్నారు. ఆయన భౌతికంగా మరణించినా అభిమానుల హృదయాల్లో మాత్రం జీవించి ఉన్నారు.జనవరి 20వ తేదీన కృష్ణంరాజు పుట్టిన రోజు కాగా శ్యామలా దేవి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా సర్వస్వం కృష్ణంరాజు గారు అని ఆ శ్యామలా దేవి ఇప్పుడు లేదని ఆయన జ్ఞాపకార్థంగా మిగులున్నానని శ్యామలాదేవి కామెంట్లు చేశారు. మా చుట్టాల ద్వారా కృష్ణంరాజు తో పెళ్లి కుదిరి ఆయన అర్ధాంగిగా మారానని శ్యామలా దేవి వెల్లడించారు. కృష్ణంరాజు మొదటి భార్య పేరు సీతాదేవి అని అన్నారు.ఆమె కారు ప్రమాదం లో మరణించిందని కృష్ణంరాజు మొదట రెండో పెళ్లి కి ఒప్పుకోలేదని మామయ్య నిరాహార దీక్ష చేసి ఒప్పించారని ఆమె వెల్లడించారు. తండ్రి బాధ చూడలేక ఆయన రెండో పెళ్లికి అంగీకరించారని శ్యామలా దేవి పేర్కొన్నారు. మొదట రెండో పెళ్లి అని మా అమ్మ ఒప్పుకోలేదని ఆమె కామెంట్లు చేశారు. నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టం చూపానని శ్యామలాదేవి అన్నారు.

నన్ను బలవంతంగా పెళ్లి కి ఒప్పించారేమో అని కృష్ణంరాజు భావించారని శ్యామలాదేవి పేర్కొన్నారు. కృష్ణంరాజు మొదటి భార్య కు వారసుడు పుట్టాడని డెలివరీ సమయం లో వైద్యుల నిర్లక్ష్యం వల్ల మరణించాడని శ్యామలాదేవి చెప్ప్పుకొచ్చారు. శ్యామలాదేవి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. శ్యామలాదేవికి వరుసకు కొడుకైన ప్రభాస్ వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ రాజాసాబ్ సినిమాపై, ప్రాజెక్ట్ కే సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రభాస్ కు ఇతర భాషల్లో సైతం ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: