చైతు జ్ఞాపకాల నుంచి మాత్రం దూరం కాలేకపోతున్న సమంత...!!

murali krishna
స్టార్ హీరోయిన్ సమంత తన మాజీ భర్త నాగచైతన్య తో విడిపోయాక, తమ సంసారం గురించి ఒక్క కామెంట్ కూడా చేయలేదు. కొన్ని సార్లు ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేసినా సూటి గా సుత్తి లేకుండా సామ్ అసలు విషయం చెప్పలేదు.కానీ, తాజా గా సమంత 'నేను చేసిన అతిపెద్ద తప్పు అదే' అంటూ కొన్ని షాకింగ్ విషయాలు చెప్పింది. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. 'సమంత తన వైవాహిక జీవితం గురించి స్పందించింది. 'నేను నా దాంపత్య జీవితం లో అతని ఇష్టాలను గుర్తించడం లో విఫలమయ్యాను.పైగా గతం లో నా మాజీ భాగ స్వామి నన్ను ఎక్కువ ప్రభావితం చేశాడు. ఎందుకో తెలియదు, ఆ సమయం లో నా గురించి నేను తెలుసుకున్నాను. సంతోషం కన్నా జీవితం లో ఏదీ ముఖ్యం కాదు అనిపించింది. అలాంటి సంతోషం కోసం నేను ఎప్పుడూ సిద్దం గానే ఉంటాను. ఐతే, మన సంతోషం ఒక్కోసారి మన తో ఉన్నవారి కి బాధ కలిగించొచ్చు. ఆ క్రమం లోనే ఆ తర్వాత నేను కొన్ని ఇబ్బందులు పడ్డాను. ఐతే, ఆ క్లిష్ట సమయం నుంచే నేను విలువైన పాఠం నేర్చు కోగలను అని అర్థమైందని సమంత వెల్లడించింది.పైగా ఈ విషయాన్ని నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నట్లు సమంత చెప్పింది. ఇక ఈ విషయం గ్రహించిన తర్వాతే తన వ్యక్తిగత ఎదుగుదల మొదలైందని ఆమె చెప్పుకొచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత - నాగచైతన్య, 2021 లో విడిపోయిన విషయం తెలిసిందే. మొత్తానికి చైతు తో విడిపోయాక కూడా సమంత అతని జ్ఞాపకాల నుంచి మాత్రం దూరం కాలేకపోతుంది. ఇక సమంత ప్రస్తుతం సినిమాలకు దూరమై చికిత్స చేయించుకుంటోంది. ఆమె ప్రజెంట్ క్రయో థెరపీ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: