టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున సంక్రాంతి పండుగ సందర్భంగా నా సామి రంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది.గుంటూరు కారం, హనుమాన్ సినిమాల తర్వాత ఈ సినిమా మంచి వసూళ్ళని రాబడుతుంది. ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో ఎక్కువ మంది ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తున్నారు. ఇదిలా ఉంటే బంగార్రాజు సినిమా తర్వాత టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున సాలిడ్ సక్సెస్ కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. గత కొన్నేళ్ల నుంచి అక్కినేని యువ హీరోలకి కూడా హిట్ పడలేదు. ఇలాంటి సమయంలో నా సామి రంగా సినిమా సంక్రాంతి రేసులో పెద్ద సినిమాలతో పోటీ పడి హిట్ గా నిలిచింది.వెంకటేష్ సైంధవ్ మూవీకి డివైడ్ టాక్ రావడంలో ఈ సినిమా ముందుకు వెళ్ళింది.ఈ నేపథ్యంలో నా సామిరంగ సినిమాకి కలెక్షన్స్ కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 35.4 కోట్ల కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.
ఇక తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకి 18.17 కోట్ల షేర్ రావడం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాలలో ఐదో రోజు 2. 54 కోట్ల కలెక్షన్స్ ని ఈ సినిమా కలెక్ట్ చేసింది. ఇంకా అలాగే విశాఖ, ఈస్ట్, వెస్ట్ గోదావరి, గుంటూరు, సీడెడ్ ప్రాంతాలలో బ్రేక్ ఈవెన్ కూడా అందుకుంది. ఓవరాల్ గా కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం తెలుస్తోంది.ఈ సినిమాతో కేవలం కింగ్ నాగార్జునకి మాత్రమే కాకుండా అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లాంటి టాలెంటెడ్ హీరోలకి కూడా హిట్ పడింది. ఇక యంగ్ హీరో రాజ్ తరుణ్ చాలా కాలం నుంచి వరుస డిజాస్టర్స్ తో సతమతం అవుతున్నాడు. నా సామిరంగా సినిమాతో మరల ఈ యువ హీరో కెరియర్ గాడిలో పడే అవకాశం కనిపిస్తోంది.ఇతని కెరీర్లో ఫస్ట్ మూడు సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. ఈ సినిమాతో మళ్ళి సక్సెస్ బాట పడ్డాడు. ఇక తెలుగు ప్రజలకు ఎంతో ఇష్టమైన హీరో అల్లరి నరేష్. నిజానికి ఒకప్పుడు అందరి హీరోల కంటే ఎక్కువ హిట్లు అందుకున్న నరేష్ ప్రస్తుతం యువ హీరోలతో పోటీ పడలేక స్లో అయ్యాడు. కానీ మహర్షి, నాంది సినిమాలతో కం బ్యాక్ హిట్లు అందుకున్న నరేష్ ఈ సినిమాతో కూడా మరో హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు.