సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా గుంటూరు కారం అనే సినిమాలో హీరోగా నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే గుంటూరు కారం సినిమా విడుదలకు ముందే మహేష్ , రాజమౌళి తో ఓ మూవీ చేయడానికి ఫిక్స్ అయిన విషయం కూడా మనకు తెలిసిందే. ఇకపోతే ఇప్పటికే రాజమౌళి ... మహేష్ తో తెరకెక్కించబోయే మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు.
మహేష్ కూడా గుంటూరు కారం సినిమా పూర్తి అయిన తర్వాత ఏ సినిమా ఒప్పుకోకుండా కేవలం రాజమౌళి సినిమా పైనే తన ఫుల్ ఫోకస్ ను పెట్టబోతున్నాడు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న మహేష్ బాబు ... ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ కలిగిన రాజమౌళి కాంబో లో రూపొందబోయే సినిమా కావడంతో ఈ మూవీ పై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తం గా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనా లకు తగినట్టుగానే రాజమౌళి తండ్రి వీరి కాంబో కోసం ఒక అదిరిపోయే కథను చాలా రోజులుగా రెడీ చేస్తున్న విషయం మనకు తెలిసిందే .
ఇకపోతే తాజా గా రాజమౌళి తండ్రి ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు . ఆ ఇంటర్వ్యూ లో భాగంగా మహేష్ ... రాజమౌళి కాంబో మూవీ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు . తాజా ఇంటర్వ్యూ లో భాగంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ... మహేష్ ... రాజమౌళి కాంబో లో వచ్చే మూవీ కి సంబంధించిన కథ పనులు మొత్తం పూర్తి అయ్యాయి అని అప్డేట్ ఇచ్చాడు. దీనితో మహేష్ అభిమానులు ఫుల్ ఖుషి లో ఉన్నారు .