అబ్బాస్ ఇండస్ట్రీ నుండి దూరం కావడానికి కారణం బాలయ్య బాబునా....??
ఇక దాంతో అప్పటినుంచి పెద్ద డైరెక్టర్లు తనని రిఫర్ చేయనట్టుగా వార్తలు కూడా భారీ ఎత్తున వినిపించాయి. దాంతో అప్పటినుంచి అబ్బాస్ కెరీర్ కొంతవరకు డౌన్ ఫాల్ అయింది. ఇక ప్రస్తుతం ఆయన సినిమా ఇండస్ట్రీని వదిలేసి న్యూజిలాండ్ కి వెళ్ళి అక్కడ జాబ్ చేసుకుంటూ సెటిలైపోయాడు. అయితే బాలయ్య బాబుతో కృష్ణబాబు సినిమా చేసే కంటే ముందే అబ్బాస్ కెరియర్ ఆల్మోస్ట్ ఫెయిడ్ అవుట్ దశకు వచ్చేసింది. ఇక ఆ తర్వాత కూడా అబ్బాస్ కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆయన పెద్దగా సక్సెస్ లు సాధించలేకపోయాడు.ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో కనిపించిన కూడా పెద్దగా ప్రభావం అయితే లేకపోయింది. దాంతో సినిమా ఇండస్ట్రీ ని వదిలేసాడు. ఇలా బాలయ్య బాబు దెబ్బకి ఒక స్టార్ హీరో ఇండస్ట్రీ వదిలేసారు అంటూ అప్పట్లో కథలు కథలు గా న్యూస్ లు అయితే వచ్చాయి. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలయ్య బాబు మంచి సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు ఆయన బాబీ దర్శకత్వంలో ఒక మాస్ కమర్షియల్ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా సమ్మర్ కి గాని లేదా దసరా సీజన్ కి గాని రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.