ఆ రోజుల్లో దివంగత నందమూరి తారకరామారావు ఇచ్చిన సలహా తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ఆర్థిక సలహాలు నాపైనా, నా కుటుంబంపైనా చాలా ప్రభావం చూపించాయని చిరంజీవి అన్నారు.వైజాగ్‌లో లోక్‌నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏఎన్‌ఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌లపై తనకున్న అభిమానాన్ని చిరంజీవి చాటుకున్నారు. తనకు ఫ్యాన్సీ కార్లంటే మోజు ఉండేదని.. రెక్కల తరహా డోర్లు ఉండే టయోటా కారుపై నా దృష్టి ఉండేది. ఎన్టీఆర్ గారు అల్యూమినియం ఫాయిల్ వాహనాలపై పెట్టుబడి పెట్టవద్దని, భూములు కొనుక్కోమని సలహా ఇచ్చారన్నారు. నేను ఆ రోజు ఎన్టీఆర్ మాటలు నమ్మి భూమిని కొన్నాను, అది ఇప్పుడు నన్ను, నా కుటుంబానికి ఎంతో మంచి చేసింది. ఆయన సపోర్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేనని చిరంజీవి అన్నారు. తన జీవిత చరిత్రను రాసే బాధ్యతను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌కు అప్పగిస్తున్నట్లు చిరంజీవి ప్రకటించారు. తన ఆత్మకథపై పనిచేయడానికి తనకు సమయం లేదని, అందుకే దానిని నిర్వహించే బాధ్యతను యండమూరికే వదిలేశానని మెగాస్టార్ చిరంజీవి ప్రకటన చేశారు.
ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. '"తిరుగులేని మనిషి" సమయంలో ఉడుకు రక్తం కూడా కావడంతో స్వయంగా స్టంట్స్ చేస్తుంటే.. ఆర్టిస్టుల జీవితం విలువైనది. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. ఏదైనా జరిగితే నిర్మాతకు నష్టమని చెప్పారు. తర్వాత ఏడాది "సంఘర్షణ" సమయంలో గాయపడి ఆర్నెల్లు షూటింగ్స్ లేకుండా గడిపాను. పెద్దలు ఏం చెప్పినా దూరదృష్టితోనే అప్పుడే అర్ధమయింది. సూపర్ స్టార్ జీవితం శాశ్వతం కాదని.. విలాస వస్తువుల కంటే ఇళ్లు, స్థలాలు కొనుక్కోవాలని సూచించారు. ఈరోజు అవే నన్ను, నా కుటుంబాన్ని కాపాడుతున్నాయి'.ఏఎన్నార్ గురించి మాట్లాడుతూ.. 'ఏఎన్నార్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఎటువంటి విషయమైనా సరదాగా చెప్పేవారు. తన కెరీర్లో ఎదురైన అనుభవాలు.. తనలోని బలహీనతలను బలాలుగా ఎలా మార్చుకున్నదీ చెప్పేవారు'. ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న వీరిద్దరితో నటించే అవకాశం నా అదృష్టంగా భావిస్తున్నా.