సాయి పల్లవికి ఫిదా అయిన సమంత.. వీడియో వైరల్..!!

Divya
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. చివరిసారిగా ఈమె డైరెక్టర్ శివ నిర్వహణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటించింది. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా కనిపించారు. ఆ తర్వాత ఈమె మరో ప్రాజెక్ట్ గురించి ఎక్కడ తెలుపలేదు. మయోసైటీస్ సమస్యతో గత కొన్నేళ్లుగా ఇబ్బంది పడుతున్న సమంత ఆ వ్యాధికి చికిత్స కోసం అమెరికాకు వెళ్లి అక్కడే గత కొన్ని నెలలుగా ట్రీట్మెంట్ తీసుకుంది .ఆ తర్వాత భూటాన్లో ఇమ్యూనిటీ పవర్ కోసం చికిత్స కూడా తీసుకుంది.


ఇటీవల సమంత ఇండియాకు తిరిగివచ్చి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.ఇటీవల హనుమాన్ సినిమా పైన తన అభిప్రాయాన్ని కూడా తెలిపింది. ఈ చిత్రంలోని సమంతకు సంబంధించి ఒక త్రో బ్యాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. హీరోయిన్ సాయి పల్లవి టాలెంట్ కు సమంత ఫిదా అయినట్టుగా తెలుస్తోంది.


సాయి పల్లవి ఎనర్జీ డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసి ఆశ్చర్యపోయి మాటలు రావడం లేదంటూ చెప్పుకొచ్చింది సమంత. కానీ ఆ మాటలు ఇప్పుడు చెప్పింది కాదు దాదాపుగా కొన్ని సంవత్సరాల క్రితం చెప్పినట్లుగా తెలుస్తోంది.. సమంత కెరియర్ మొదలు పెట్టినప్పుడు ప్రముఖ డాన్స్ షోకి అతిథిగా హాజరయ్యారు అప్పుడు సాయి పల్లవి ఆ షోలో కంటిస్టెంట్గా పాల్గొనింది ఈ షోలు సాయి పల్లవి డాన్స్ చూసి ఫిదా ఆయన సమంత మీరు డాన్స్ చేస్తున్నప్పుడు నా చూపు తిప్పుకోలేకపోయానని అంత అద్భుతంగా డాన్స్ చేశారంటూ తెలిపింది. అందుకు సాయి పల్లవి కూడా థాంక్స్ అంటూ సమాధానాన్ని ఇచ్చింది అందుకు సంబంధించి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. దాదాపుగా ఇది 2019లో వచ్చినట్టుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: