టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా ఈ సంక్రాంతి పండగకి వచ్చిన 'హనుమాన్' సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా రిలీజ్ రోజు ముందు ప్రీమియర్స్ నుంచే హిట్ టాక్ తెచ్చుకొని పాన్ ఇండియా వైడ్ గా భారీ వసూళ్లతో దూసుకుపోయింది. మూడేళ్ళ క్రితం మొదలైన ఈ సినిమా మొదట్నుంచి రిలీజ్ ముందు దాకా కూడా ఎన్నో అంచనాలతో రిలీజ్ అయి సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది.హనుమాన్ సినిమా రిలీజ్ అయి తొమ్మిది రోజులు అవుతున్నా ఇంకా సంక్రాంతి హాలిడేస్ అయిపోయినా ఇంకా థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. భారీగా కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ఫుల్ ప్రాఫిట్స్ లో దూసుకుపోతుంది.ఈ సినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయిపోయి సరికొత్త రికార్డులు సెట్ చేస్తుంది.ఇక హనుమాన్ సినిమా నార్త్ ఇండియా, అమెరికాలో బాగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నార్త్ ఇండియాలో ఇప్పటికే 25 కోట్ల దాకా కలెక్షన్స్ రాబట్టింది. ఇక అమెరికాలో అయితే హనుమాన్ సినిమా సరికొత్త రికార్డ్ ని సెట్ చేసింది.
హనుమాన్ సినిమా అమెరికాలో 4 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. అంటే మన కరెన్సీలో దాదాపు 32 కోట్లకు పైగా ఈ సినిమా కలెక్ట్ చేసింది. అది కూడా కేవలం 9 రోజుల్లో చెయ్యడం విశేషం.అమెరికాలో టాప్ 10 కలెక్షన్స్ సాధించిన తెలుగు సినిమాల్లో 20 మిలియన డాలర్స్ తో బాహుబలి 2 సినిమా మొదటి ప్లేస్ లో ఉంది. ఇక rrr సినిమా 14.3 మిలియన డాలర్స్ తో రెండో ప్లేస్ లో ఉంది. సలార్ సినిమా 8.9 మిలియన డాలర్స్ తో మూడో ప్లేస్ లో, బాహుబలి 1 సినిమా నాలుగో స్థానంలో 8 మిలియన డాలర్స్ తో ఉంది. దాని తర్వాత ఇప్పుడు 5వ స్థానంలో 4 మిలియన డాలర్స్ తో హనుమాన్ సినిమా చేరింది. ఇక 3 మిలియన డాలర్స్ పైన అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో, రామ్ చరణ్ రంగస్థలం, మహేష్ బాబు భరత్ అనే నేను, ప్రభాస్ సాహో, ఆదిపురుష్ సినిమాలు ఉండగా వీటన్నిటిని దాటి హనుమాన్ సినిమా 4 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. పైగా ఈ కలెక్షన్స్ ఇంకా పెరగనున్నాయి. దీంతో హనుమాన్ సినిమా నార్త్ అమెరికాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన తెలుగు సినిమాల్లో అయిదో సినిమాగా నిలిచింది. మరోసారి కంటెంట్ ఉంటే చిన్న సినిమా అయినా భారీ విజయం సాధిస్తుందని హనుమాన్ సినిమా ప్రూవ్ చేసింది.