జైలర్-2సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రజనీకాంత్..!!

Divya
డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ రజనీకాంత్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీ జైలర్ ఈ సినిమా తెలుగు తమిళ్ ఇండస్ట్రీలో భారీ విజయాన్ని అందుకుంది ఎన్నో ఫ్లాపుల తర్వాత రజనీకాంత్ కు ఈ సినిమా కాస్త ఊరట ఇచ్చిందని చెప్పవచ్చు.. జైలర్ సినిమాతో ఏకంగా రూ .700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు రజనీకాంత్.. బీస్ట్ సినిమా తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ సినిమాని తెరకెక్కిస్తున్నప్పుడు అందరూ ఆయనని ట్రోల్ చేశారు.. కానీ జైలర్ సినిమా విడుదలయ్యాక తన స్టామినా ఏంటో చూపించారు.

ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పాటలు కూడా హైలెట్గా నిలిచాయి..సంగీతాన్ని అనిరుద్ ఈ సినిమాకి అందించారు.. మొత్తానికి జైలర్ సినిమా రజినీకాంత్ కెరియర్ లోనే ఒక బెస్ట్ మూవీ గా నిలిచింది.. ఇదంతా ఇలా ఉండగా జైలర్ సినిమాకు సీక్వెల్ రాబోతోంది అంటూ కోలీవుడ్ లో ఇప్పటికే పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం రజనీకాంత్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉండడంతో పాటు వెంకట్ ప్రభు డైరెక్షన్ లో కూడా మరొక సినిమాలో నటిస్తున్నారు.

వీటితో పాటు లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ఒక సినిమా ఉన్నది.దీంతో జైలర్ సీక్వెల్ కూడా త్వరలోనే ప్రారంభించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రజనీకాంత్ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సంగీత దర్శకుడు ఆనిరుద్ కూడా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.. త్వరలోనే ఈ విషయం పైన ఆఫీసియల్ గా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ మీడియా నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ లోనే అత్యధికంగా రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోగా ఒక రికార్డును సైతం సృష్టిస్తున్నారు. జైలర్ సినిమాకి రూ .200 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్నట్లుగా వార్తలు వినిపించాయి. మరి ఈసారి సినిమాకు ఎంత తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: