రణబీర్ శృంగార సన్నివేశాలకు అలియా రియాక్షన్ అదే?

Purushottham Vinay
బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ ఎప్పుడూ కూడా బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలుస్తారు. అలాగే వీరికి సంబంధించిన విషయాలు ఫోటోలు, వీడియోలు ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. వీరిద్దరూ ప్రస్తుతం  కెరీర్ లో ఫుల్ జోష్ లో ఉన్నారు. అలియా భట్ రీసెంట్ గా నేషనల్ అవార్డుని సొంతం చేసుకుంటే, రణబీర్ కపూర్ ‘యానిమల్’ సినిమాతో బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.ఈ సినిమాతో ఏకంగా 900 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టి కెరీర్ హైయెస్ట్ ని నమోదు చేసుకున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ వంగ ఈ సినిమాని డైరెక్ట్ చేయగా రష్మిక, త్రిప్తి దిమ్రి హీరోయిన్స్ గా నటించారు.కాగా ఈ సినిమాలో హీరో హీరోయిన్ మధ్య చాలా వరకు ఇంటిమేట్ సీన్స్ ఉంటాయి.అయితే ఈ సీన్స్ చేయడానికి రణబీర్ కూడా ముందుగా సందేహంలో నిలిచారట. అయితే అలియా భట్ తనని బాగా ఎంకరేజ్ చేసి.. ఆ ఇంటిమేట్ సీన్స్ చేయడానికి రణబీర్ కపూర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.



యానిమల్ సినిమాకి సంబంధించి ప్రతి సన్నివేశం గురించి రణబీర్, తన భార్య అలియాతో మాట్లాడేవారట. ఈక్రమంలోనే ఈ ఇంటిమేట్ సీన్స్ గురించి కూడా ఆమెకు చెప్పారట.ఆ సీన్స్ చేయడానికి రణబీర్ ఆలోచిస్తుంటే అలియా ధైర్యం చెప్పి పాత్రకి ఏం కావాలో అవి చెయ్యి అని ఎంకరేజ్ చేశారట. కాగా ఈ సీన్స్ పై చాలా మంది ఆడియన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన కల్చర్ ని మించి సీన్స్ షూటింగ్ ఉందని పలువురు అసహనం తెలియజేశారు. ఇదిలా ఉంటే, ఈ సినిమాని ఆదరించిన ఆడియన్స్ అంతా ఈ సినిమా సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు.ఇక ‘యానిమల్ పార్క్’ టైటిల్ తో సీక్వెల్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. ఆ సీక్వెల్ లో మరింత ఇంటిమేట్ అండ్ వైలెన్స్ సీక్వెన్స్ ఉండబోతుందంటూ సందీప్ రెడ్డి వంగ తెలియజేశారు. ఇక ఈ యానిమల్ మూవీ ఓటీటీ రిలీజ్ ని జనవరి 26న ఉండబోతుందని సమాచారం తెలుస్తుంది.ఇక థియేటర్ లోకి ఈ సినిమా 3 గంటల 21 నిమిషాల నిడివితో వచ్చింది. అయితే ఓటీటీలో మరో 8 నిమిషాలు జతచేసుకొని ఏకంగా 3 గంటల 29 నిమిషాల రన్ టైంతో స్ట్రీమ్ కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: