తమిళ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు సూర్య. ఎప్పుడు ఒకే విధమైన పాత్రలను కాకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్ పాత్రలను ఎంచుకుంటూ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే తనను తాను అప్డేట్ చేసుకునే పాత్రలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో ఇప్పుడు టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. రెగ్యులర్ గా ఉండే పాత్రలు చేయడానికి ఎప్పుడూ కూడా అసలు ఇష్టపడడు సూర్య. అందువల్లే ఒక గజిని శివ పుత్రుడు జై భీమ్ వంటి సినిమాలను చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు. అయితే చాలా సంవత్సరాల నుండి తెలుగులో డైరెక్ట్ గా సినిమాలో చేయడం లేదు సూర్య. ఈ క్రమంలోనే చాలామంది తెలుగు స్టార్ డైరెక్టర్లు సూర్యతో డైరెక్ట్ తెలుగు సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
అయినప్పటికీ కొన్ని కారణాలవల్ల ఈ సినిమాలను పోస్ట్ ఫోన్ చేస్తూ వస్తున్నాడు సూర్య. ఇప్పుడు మాత్రం మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూర్య సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలైతే వస్తున్నాయి. రీసెంట్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన గుంటూరు కారం సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో నెక్స్ట్ తీయబోయే సినిమా మీద గురిజి ఎలాంటి కసరత్తులు చేస్తాడో చూడాలి. ఇక ఆయన నెక్స్ట్ అల్లు అర్జున్ తో ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా పూర్తి అయ్యాక సూర్యతో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలైతే వస్తున్నాయి.
త్రివిక్రమ్ అఆ సినిమా రిలీజైన తర్వాతే వీళ్ళ కాంబినేషన్ లో సినిమా రావాల్సింది కానీ అప్పటినుంచి ఇప్పటివరకు ఆ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఇక ఎట్టకేలకు అల్లు అర్జున్ తో సినిమా తర్వాత సూర్య సినిమా చేయాలని కాన్సెప్ట్ లో త్రివిక్రమ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక విషయాన్ని సూర్యకి కూడా చెప్పారట. దాంతో తొందర్లోనే ఈ సినిమాకి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి. త్రివిక్రమ్ డైరెక్షన్ లో సూర్య నటిస్తే ఆ సినిమా ఎలా ఉండబోతుంది అంటూ ఇప్పటికి ప్రేక్షకులు ఊహగానాలు కూడా వేస్తున్నారు.త్రివిక్రమ్ ఫార్మాట్ లోకి సూర్య వస్తాడా..? లేదా సూర్య స్టైల్ లో కి త్రివిక్రమ్ వస్తాడా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..!!