నార్త్ ఇండియన్ ఆడియన్స్ తెలుగు సినిమా అనగానే ఖచ్చితంగా ఏదో విషయం ఉండొచ్చనే పాజిటివ్ దృక్పథంతో ఉన్నారు. ఇక దీనికి కారణం కార్తికేయ2, పుష్ప లాంటి సినిమాలు.అయితే కేవలం రాజమౌళి చేసే సినిమాలకి మాత్రమే అన్ని భాషల నుంచి ఆదరణ లభిస్తోంది. పక్క రాష్ట్రాలైన తమిళ్, మలయాళీ భాషలలో మన పాన్ ఇండియా సినిమాలకి మాత్రం ఆశించిన స్థాయిలో ఆదరణ లభించడం లేదు. రీసెంట్ గా వచ్చిన ప్రభాస్ సినిమా సలార్ తెలుగు తర్వాత నార్త్ లోనే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది.తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో అట్టర్ ప్లాప్ గా నిలిచింది. కన్నడలో అంటే ఉగ్రం రీమేక్ అనే క్లారిటీ ఉంది కాబట్టి సలార్ సినిమా ఎవ్వరు చూడలేదు.ఇక తమిళ్, మలయాళీ భాషలలో కూడా పెద్దగా ఆదరించలేదు. సైరా నరసింహా రెడ్డి సినిమాలో విజయ్ సేతుపతి, నయనతార లాంటి పెద్ద తమిళ్ స్టార్స్ ఉన్న పెద్దగా ఆదరణకి నోచుకోలేదు.తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ మూవీకి కూడా ఆ రాష్ట్రాలలో ఆశించిన సక్సెస్ అయితే రాలేదు.
తాజాగా వచ్చిన హనుమాన్ సినిమాకి అయితే నార్త్ ఇండియాలో పట్టం కడుతున్నారు. కాని తమిళనాడు, కేరళలో కనీసం బ్రేక్ ఈవెన్ కూడా కాలేదని సమాచారం తెలుస్తోంది. తమిళనాడులో కేవలం 2.25 కోట్ల గ్రాస్ వస్తే అందులో మెజారిటీ తెలుగు వెర్షన్ ద్వారానే వచ్చింది. కేరళలో అయితే కేవలం 50 లక్షలు మాత్రమే ఈ సినిమాకి వసూళ్లు చేసింది. ఇక కర్ణాటకలో కూడా చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాలేదని సమాచారం తెలుస్తుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ 170 కోట్ల పైగా గ్రాస్ 100 కోట్ల పైగా షేర్ వసూళ్లు సాధించింది.అయితే తమిళ్ సినిమాలలో చాలా వాటిని తెలుగు రాష్ట్రాలలో ప్రేక్షకులు ఎలాంటి ప్రాంతీయత ఫీలింగ్ లేకుండా ఆదరిస్తూ ఉంటారు. సూర్య, విజయ్, అజిత్, కార్తి, విక్రమ్, కమల్ హాసన్, రజినీకాంత్, శివ కార్తికేయన్ ఇంకా ధనుష్ లాంటి వారికి తమిళంలో ఎంత ఫేం ఉందో తెలుగులో కూడా అంతే స్థాయిలో ఫేమ్ ఉంది. వారి సినిమాలకి తెలుగులో కూడా మంచి ఓపెనింగ్స్ వస్తాయి. కాని మన స్టార్ హీరోల సినిమాలని మాత్రం కోలీవుడ్ లో తమిళ ఆడియన్స్ కనీసం చూడటానికి కూడా ఇష్టపడరు. కేవలం వారి సినిమాలని మాత్రమే వారు ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడు హనుమాన్ సినిమా విషయంలో కూడా అదే జరిగింది.