నమ్రత బర్త్డే సెలెబ్రేషన్స్ మహేష్ చేయకపోవడానికి కారణం అదేనా....!!
నా ప్రతిరోజుని మరింత అందంగా, స్పెషల్ గా చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ప్రతిసారి తన భార్య పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా చేసే మహేష్ బాబు ఈసారి మాత్రం తన భార్యకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు జర్మనీ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమం లోనే ఈమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇక సితార సైతం తన తల్లి కి సోషల్ మీడియా వేదిక గా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇక నమ్రత సినిమా లకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా లో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీకి సంబంధించిన అన్ని విషయాలను పంచుకుంటారు అదేవిధంగా ఈమె మరోవైపు బిజినెస్ లను కూడా ముందుకు నడిపిస్తున్న సంగతి తెలిసిందే.