ఎన్టీఆర్ అయోధ్యకు వెళ్లకపోవడానికి కారణం ఆయనేనా..?

Divya
అయోధ్యలో బాల రాముడు విగ్రహాన్ని సైతం నిన్నటి రోజున చాలా ప్రతిష్టాత్మకంగా ప్రాణ ప్రతిష్ట చేశారు. ఈ వేడుకలు చూడడానికి చాలామంది ప్రముఖులతో పాటు సినీ రాజకీయ నాయకులు కూడా చేరుకున్నారు. ముఖ్యంగా అన్ని ఇండస్ట్రీలోని నటీనటులు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ ఆహ్వానం అందుకున్న ప్రతి స్టార్ హీరో అయోధ్యకు కూడా వెళ్లారు.. అలా రామ్ చరణ్, చిరంజీవి ,రజనీకాంత్, తదితర నటి నటుల సైతం ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ మాత్రం హాజరు కాలేదు. అందుకు కారణం ఉన్నట్లుగా తెలుస్తోంది.


ఎన్టీఆర్ హాజరు కాలేకపోవడానికి ముఖ్య కారణం ప్రస్తుతం తను నటిస్తున్న దేవర సినిమా షూటింగ్ ఏ అన్నట్లుగా తెలుస్తోంది .ఈ షూటింగ్లో బిజీగా ఉండడం చేత ఆయన ఈ కార్యక్రమానికి రాలేకపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ తో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ వెళ్ళిపోతే నిర్మాతలకు చాలా ఇబ్బంది పడుతుందని భావించి అయోధ్యకు వెళ్లలేదని టాక్ వినిపిస్తోంది.


అంతేకాకుండా సైఫ్ అలీ ఖాన్ కు గాయాలు కావడం చేత ఆసుపత్రిలోకి వెళ్లడంతో చివరి నిమిషంలో తారక్ అయోధ్య ట్రిప్ రద్దు చేసుకున్నట్లు ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది. మొత్తానికి అయోధ్యకు వెళ్లకపోవడానికి కారణం సైఫ్ అలీ ఖాన్ కు ప్రమాదం జరగడంతో పాటు డైరెక్టర్ కొరటాల శివ అని చెప్పవచ్చు.. ఈ సినిమా షూటింగ్ శేరవేగంగా పూర్తి చేయాలని అనుకున్న సమయానికి విడుదల చేయాలని కొరటాల శివ కూడా పట్టు పట్టడంతో ఎన్టీఆర్ ఎక్కువగా గ్యాప్ తీసుకోలేదని తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ అయోధ్యకు రాకపోవడంతో అభిమానులు కాస్త నిరుత్సాహంలో ఉన్నారు. మరి షూటింగ్ అయిపోయిన తర్వాత వెళ్లి అభిమానులను ఆనందపరుస్తారేమో చూడాలి మరి. ఈ సినిమా షూటింగ్ అయిపోగానే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: