అలాంటి హద్దులను కచ్చితంగా పాటిస్తానంటున్నా మెగా కోడలు....!!
పెళ్లి తర్వాత సినిమాలు, రోల్స్ విషయంలో అత్తింటి వైపు నుంచి ఎలాంటి షరతులు లేవని లావణ్య అన్నారు. నా భర్త కూడా ఇలాంటి పాత్ర లే చేయాలని ఎలాంటి షరతులు పెట్టలేదని ఆమె పేర్కొన్నారు. అయితే నాకంటూ కొన్ని హద్దులు ఉన్నాయని ఆ హద్దులను అవి మాత్రం పాటిస్తానని లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చారు. లావణ్య త్రిపాఠి రెమ్యునరేషన్ సైతం పరిమితంగా ఉందని తెలుస్తోంది.భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో లావణ్య త్రిపాఠి కచ్చితంగా విజయాలను సొంతం చేసుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. లావణ్య సినిమాలలో నటిస్తానని చెప్పడంలో వరుణ్ తేజ్ లావణ్యల కాంబోను మరోసారి సిల్వర్ స్క్రీన్ పై చూసే ఛాన్స్ కూడా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి రేంజ్ అంతకంతకూ పెరగాలని సక్సెస్ రేట్ కూడా మరింత పెరగాలని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లావణ్య క్రేజ్ ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.