ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చేసిన మోహన్ లాల్ మూవీ...!!

murali krishna
మలయాళం సూపర్ స్టార్ నటించిన లేటెస్ట్ మూవీ 'నేరు'.డిసెంబర్ 21 వ తేదీన థియేటర్లలోక విడుదల అయి బ్లాక్‍బాస్టర్ అయింది.కేరళ లో ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. తక్కువ బడ్జెట్‍ లోనే రూపొందిన నేరు మూవీకి సుమారు రూ.85కోట్లకు పైగానే వసూళ్లు వచ్చాయి. ఈ మూవీ పై ప్రశంసలు కూడా భారీ గా వచ్చాయి. ఇప్పుడు, ఈ మూవీ ఓటీటీ లోకి వచ్చింది. థియేటర్లలో మలయాళం లో మాత్రమే రిలీజైన నేరు.. ఓటీటీలోకి తెలుగుతో పాటు మరో మూడు భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది.డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో 'నేరు' సినిమా జనవరి 23 నుండి స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. మలయాళం తో పాటు తెలుగు, హిందీ, తమిళం మరియు కన్నడల్లోనూ ఈ మూవీ స్ట్రీమ్ అవుతోంది. దీంతో ఈ మూవీకి ఓటీటీలో మంచి ఆదరణ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.. మలయాళంలో సూపర్ టాక్ రావటంతో ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఎంతగానో ఎదురుచూశారు. ఇప్పుడు ఎట్టకేలకు ఐదు భాషల్లో డిస్నీ+ హాట్‍స్టార్‌ లో నేరు చిత్రం అడుగుపెట్టింది.నేరు సినిమాను దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించారు. గతంలో మోహన్ లాల్‍తో జీతూ తెరకెక్కించిన దృశ్యం, దృశ్యం 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కొన్ని ఇతర భాషల్లోకి కూాడా రీమేక్ అయ్యాయి. ఇప్పుడు మోహన్ లాల్ - జీతూ జోసెఫ్ మళ్లీ 'నేరు'తో బ్లాక్‌బాస్టర్ సాధించారు. ఈ సినిమాకు అక్కడి ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ చిత్రానికి జీసెఫ్‍తో పాటు శాంతి మాధవి రచయితగా వ్యవహరించారు.నేరు చిత్రంలో అనాశ్వర రాజన్, ప్రియమణి, శాంతి మహదేవి, సిద్ధిఖీ, జగదీశ్, కేబీ గణేశ్ కుమార్, శంకర్, మాథ్యూ వర్గీస్ మరియు హరిత నాయర్ కీలక పాత్రలు పోషించారు. ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోనీ పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. విష్ణు శ్యాం సంగీతం అందించారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: