బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇటీవల బిగ్ బాస్ సీజన్ సెవెన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. అయితే బిగ్బాస్ సీజన్ సెవెన్ లో కంటెస్టెంట్ గా వచ్చిన శోభా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ ముద్దుగుమ్మ హౌస్ లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. స్టార్ మా బ్యాచ్ లాగా అమర్ దీప్ ప్రియాంక శోభా శెట్టి ముగ్గురు కలిసి ఒక చెరగని ముద్ర వేసుకున్నారు అని చెప్పొచ్చు. ఇక శోభా శెట్టి బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఇంకొక వారంలో ముగుస్తుంది అనగా ఇంట్లో నుంచి బయటకు వచ్చింది.
కార్తీక దీపం సీరియల్ లో మోనిత పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శోభా శెట్టి ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కి వచ్చింది. అక్కడ తన ఆటతో అందరినీ మెప్పించింది. టాప్ 5లో లేదన్న మాటే కానీ ఫైనల్ ముందు వారం వరకు శోభా శెట్టి హంగామా చేసింది.హౌస్ లో టేస్టీ తేజాతో క్లోజ్ గా ఉన్న శోభా శెట్టి అతను ప్రేమిస్తున్నానని వెంటపడినా సరే లైట్ తీసుకుంది. అయితే అదే హౌస్ లో ఉన్నప్పుడు తనకు యశ్వంత్ రెడ్డితో ఉన్న ప్రేమని బయట పెట్టింది. ఇద్దరు కలిసి కార్తీక దీపం సీరియల్ లో నటించారు. ఆ టైం లోనే శోభా శెట్టికి దగ్గరయ్యాడు యశ్వంత్ రెడ్డి.
బిగ్ బాస్ హౌస్ లో వీరి ప్రేమని వెల్లడించారు.ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన శోభా శెట్టి ఎక్కువ రోజులు గ్యాప్ లేకుండానే యశ్వంత్ రెడ్డితో ఎంగెజ్మెంట్ చేసుకుంది. శోభా శెట్టి బెంగుళూరు ఇంట్లోనే యశ్వంత్ రెడ్డితో ఎంగేజ్ మెంట్ జరిగింది. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ ఎంగేజ్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది. సీరియల్ బ్యాచ్ ఎవరు కూడా శోభా శెట్టి ఎంగేజ్మెంట్ లో పాల్గొన్నట్టు లేరు. దీంతో ప్రస్తుతం శోభ శెట్టి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.