బాక్స్ ఆఫీస్ పై పంజా విసరడానికి ట్రై చేస్తున్న డైరెక్టర్ పూరీ....!!

murali krishna
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి హీరో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను అయితే సొంతం చేసుకోవాలని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే మాస్ సినిమాలు అనేవి నార్మల్ జనాలని ఎక్కువ ఇంప్రెస్ చేస్తూ ఉంటాయి.కాబట్టి ప్రతి హీరో కూడా మాస్ లో ఫాలోయింగ్ పెంచుకోవాలని చూస్తూ ఉంటాడు. ఇక అందులో భాగంగానే ప్రస్తుతం ఎనర్జిటిక్ హీరో అయిన రామ్ మాస్ హీరో గా మంచి గుర్తింపు సంపాదించుకోవాలని చూస్తున్నాడు.ఇక ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ సినిమా తో మాస్ లో మంచి పేరైతే తెచ్చుకున్నాడు. ఇక దాంతో మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. ఇక రీసెంట్ గా బోయపాటి దర్శకత్వం లో చేసిన స్కందా సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ఆడలేదు. దాంతో రామ్ క్రేజ్ కొద్ది వరకు తగ్గిందనే చెప్పాలి. అందుకే ఇప్పుడు మళ్ళీ పూరి జగన్నాథ్ దర్శకత్వం లోనే డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు.   ఇక ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే రామ్ పాన్ ఇండియా రేంజ్ లో మరొకసారి సత్తా చాటుతాడు. అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం రామ్ ఈ సినిమా మీదనే తన పూర్తి ఫోకస్ ని పెట్టాడు. ఇక సినిమాతో తన రేంజ్ మార్చాలని చూస్తున్నాడు. ఆయన అనుకున్నట్టు గానే ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందా పూరి జగన్నాథ్ ఈ సినిమా తో మరోసారి తన పంజాని బాక్స్ ఆఫీస్ మీద విసురు తాడా లేదా అనేది తెలియా లంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే...అయితే పూరి గత చిత్రం అయిన లైగర్ మూవీ ప్లాప్ అవ్వడం తో పూరి మార్కెట్ బాగా డౌన్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: