ఆ విషయంలో ప్రభాస్ మాట వినని యంగ్ టైగర్ ఎన్టీఆర్....!!
ఎన్టీఆర్ ఏ పని చేసి అంతలా నష్టపోయారు ప్రభాస్ ఎందుకు చేయద్దని చెప్పారో అసలు ఆ పని ఏంటి అనే విషయానికి వస్తే సినిమాలలో నటించడమేనని చెప్పాలి. హీరో పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమా చేసిన తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్ రామయ్య వస్తావయ్య అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా ఘోరంగా డిజాస్టర్ అయిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా కథతో హరీష్ శంకర్ ముందుగా ప్రభాస్ వద్దకు వెళ్లారట అప్పటికే ఆయన రెబల్ అనే సినిమాని ఇదివరకు చేసిన సినిమా కూడా ఇలాంటి తరహాలోనే ఉంది సరికొత్త కథతో వస్తే సినిమా చేద్దామని చెప్పి పంపించారట ఇలా ప్రభాస్ రిజెక్ట్ చేయడంతో డైరెక్టర్ ఎన్టీఆర్ వద్దకు వెళ్లారు. ఈ కథ వినగానే ఎన్టీఆర్ వెంటనే ఓకే చెప్పేసారట ఎన్టీఆర్ ఈ సినిమాకు కమిట్ అయ్యారు అనే విషయం తెలుసుకున్న టువంటి ప్రభాస్ ఎన్టీఆర్ కి ఫోన్ చేసి..
ఈ సినిమా చేయొద్దు అది వర్కౌట్ కాదు చేయనని రిజెక్ట్ చేయి అంటూ తనకు సలహా ఇచ్చారట అయితే అప్పటికే తాను దర్శక నిర్మాతలకు కమిట్మెంట్ ఇచ్చేసానని ఇక చేయక తప్పదు అంటూ ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా భారీ స్థాయిలోనే నష్టాలను ఎదుర్కొంది. ఇలా ప్రభాస్ చెప్పిన మాట వినకుండా ఎన్టీఆర్ ఈ సినిమా చేయడంతో నష్టాలను మూటకట్టుకున్నారని తెలుస్తోంది. ఇక ప్రస్తుత మీ ఇద్దరి హీరోలు పాన్ ఇండియా స్టార్ హీరోలుగా ఎంతో గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే.