గుంటూరు కారం: 11 రోజుల్లోనే భారీ వసూళ్లు?

Purushottham Vinay
అతడు, ఖలేజా సినిమాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్- సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన మాస్ సినిమా గుంటూరు కారం. మాస్ యాక్షన్స్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమా భారీ అంచానాలతో ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద 130 కోట్ల భారీ టార్గెట్ తో సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదలైంది.ఈ సినిమాలో మహేష్ మాస్ లుక్ లో దర్శనమివ్వడంతో సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. గుంటూరు కారం సినిమాకి మొదట మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత ఆ టాక్ మారింది. దీంతో బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్స్ ను ఈ సినిమా సొంతం చేసుకుంది. 11 రోజుల్లో 240 కోట్ల దాకా వసూలు చేసింది. ఇంకా డీసెంట్ వసూళ్లతో బాగా ఆడుతుంది. పోటీగా హనుమాన్ లాంటి యూనివర్సల్ కంటెంట్ తో కూడిన పాన్ ఇండియా సినిమా పోటీగా ఉన్నా గుంటూరు కారం సినిమా మాత్రం అస్సలు వెనక్కి తగ్గట్లే. మహేష్ బాబు ఒంటి చేత్తో ఈ సినిమాని కాపాడాడు.


ఇక ఈ మూవీని థియేటర్లలో మిస్ అయిన వారికి గుడ్ న్యూస్. గుంటూరు కారం సినిమా ఓటీటీలో విడుదలకు రెడీ అవుతుంది.సంక్రాంతి పండుగ బరిలో దిగిన గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ వద్ద ఘాటూ గట్టిగానే చూపించింది. ఆడియెన్స్ నుంచి మొదట్లో డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఆ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ రిపీట్ గా చూడటం వల్ల బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పటికీ కూడా థియేటర్లలో సందడి చేస్తూనే ఉంది గుంటూరు కారం. ఇక ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్దమైంది. ఈ మూవీ ఫిబ్రవరి 9 లేదా 16వ తేదీల్లో ఈ సినిమా ఓటీటీలోకి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం తెలుస్తుంది. అయితే గుంటూరు కారం ఓటీటీ విడుదలపై చిత్ర యూనిట్ ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. శ్రీలీలా,మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు. ఇక ఓటిటి వెర్షన్ లో తమిళ్, మలయాళంతో పాటు మిగిలిన భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: