అలాంటి వీడియోకి బలైన ఇంకొక టాలీవుడ్ హీరోయిన్....!!
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ సాయం తో నెట్టింట ఎన్నో మ్యాజిక్స్ చేస్తున్నారు కుర్రకారు. ఇందు లో భాగంగా కొందరు ఆకతాయిలు తప్పుడు వీడియోలు కూడా క్రియేట్ చేస్తున్నారు. తాజాగా, మరోసారి డీప్ ఫేక్ వీడియోకు బలయ్యింది బీటౌన్ మాజీ బ్యూటీ కాజోల్. ప్రస్తుతం సోషల్ మీడియా లో కాజోల్ మరో డీప్ ఫేక్ వీడియో వైరలవుతుంది. అందులో, కాజోల్ అర్ధ నగ్నం గా కనిపించడం తో ఈ వీడియో పై ఆమె ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. కాజోల్ లాంటి సీనియర్ నటి పైనే ఎందుకు ఇలాంటి వీడియోలు వస్తున్నాయి అని అజయ్ దేవగణ్ ఫ్యాన్స్ కూడా తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.
అందుబాటులోకి వస్తున్న కొత్త టెక్నాలజీని తప్పుడు కోణంలో ఉపయోగించడం కచ్చితంగా తప్పే. ఇప్పటికే, పలువురు స్టార్ నటీనటుల ముఖాల తో అసభ్యకరమైన వీడియోస్ క్రియేట్ చేసి.. వారిని మానసికంగా ఎంతో బాధ పెట్టారు. గతం లో రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో ఎంతగా వైరలయ్యిందో తెలిసిందే. ఆ తర్వాత అలియా భట్ కూడా అలాంటి వీడియో తోనే బాధ పడింది. అలాగే కాజోల్ కూడా తరుచూ అలాంటి వీడియోల బారిన పడటం బాధాకరమైన విషయం.