కెప్టెన్ మిల్లర్: తెలుగులో హిట్ అయ్యేలా ఉందిగా?

Purushottham Vinay
తమిళ స్టార్ హీరో ధనుష్సంక్రాంతి పండుగకి 'కెప్టెన్ మిల్లర్' అనే సినిమాతో తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్టర్ చేసిన ఈ మూవీ జనవరి 12న తమిళనాట రిలీజ్ అయి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే సాధించింది.నిజానికి తెలుగులో కూడా సంక్రాంతి పండుగకే ఈ సినిమాని రిలీజ్ చేయాలని అనుకున్నారు.కానీ టాలీవుడ్ లో సంక్రాంతికి తెలుగు సినిమాల మధ్య భారీ పోటీ అనేది ఉండడంతో ఈ మూవీ మేకర్స్ రిలీజ్ చెయ్యలేదు.ఇక రిపబ్లిక్ డే సందర్భంగా తెలుగులో జనవరి 26 వ తేదీన ఈ మూవీని విడుదల చేస్తున్నారు. ధనుష్ కి తెలుగులో కూడా ఈ మధ్య మంచి క్రేజ్ వచ్చింది. అప్పటిదాకా డబ్బింగ్ సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ధనుష్ గత ఏడాది 'సార్' అనే తెలుగు స్ట్రెయిట్ సినిమాని చేశాడు. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ అందుకుంది. ఈ సక్సెస్ తో తెలుగులో ధనుష్ మార్కెట్ బాగా పెరిగింది.ఇక 'సార్' సినిమా తర్వాత ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.



తెలుగులో సార్ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవడంతో కెప్టెన్ మిల్లర్ పై తెలుగు ఆడియన్స్ లో పాజిటివ్ బజ్ కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా నటించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక మోహన్ కూడా తెలుగులో మంచి క్రేజ్ దక్కించుకుంది. అలాగే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఈ మూవీలో కీలక పాత్ర పోషించారు. ఈయనకి తెలుగులో కూడా మంచి పాపులారిటీ ఉంది.తెలుగు రాష్ట్రాల్లో 'కెప్టెన్ మిల్లర్' సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మూవీ ఆల్రెడీ కోలీవుడ్లో రిలీజ్ అయ్యి పాజిటివ్ రిపోర్ట్స్ అందుకోవడంతోపాటు ధనుష్ కెరియర్ లో హైయెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది ఈ మూవీ . కేరళలో  ధనుష్ గత సినిమాల రికార్డ్స్ కూడా బ్రేక్ చేసింది.ఇక తెలుగులో ఈ సినిమాని ఏషియన్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద కంపెనీలు రిలీజ్ చేస్తుండడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో సినిమాకి భారీ సంఖ్యలో థియేటర్స్ దక్కే అవకాశం ఉంది. ఇక తెలుగులో ఈ సినిమా రిలీజ్ ఒక్కరోజు ముందు పెయిడ్ ప్రీమియర్స్ ని ప్లాన్ చేశారు మేకర్స్. ఈ ప్రీమియర్స్ కి  పాజిటివ్ రెస్పాన్స్ వస్తే తెలుగులో కూడా 'కెప్టెన్ మిల్లర్' కి భారీ కలెక్షన్స్ దక్కడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: