సీనియర్ హీరోలందరికీ మంచి కాంబినేషన్ గా మారిన యంగ్ బ్యూటీ....!!
కుర్ర హీరోయిన్ అయినప్పటికీ సీనియర్ హీరోలకు చక్కగా సరిపోతుంది అని అనుకుంటున్నారు. లేటుగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆషిక మొదట కన్నడ సినిమా రంగంలో దాదాపు 15 సినిమాల వరకు నటించింది. 2016లో క్రేజీ బాయ్స్ అనే సినిమా తో వెండితెరపై తొలిసారి కనిపించింది ఆషిక. ఆ తర్వాత కన్నడ హీరో అయినా శివ రాజ్ కుమార్ తో మాస్ లీడర్ అనే మరో సినిమాలో కనిపించింది.
దాంతో ఎక్కువగా సీనియర్ హీరోలతోనే జత కట్టిన ప్రభావము మరేంటో తెలియదు కానీ ఈ అమ్మాయి ప్రస్తుతం టాలీవుడ్ లోని సీనియర్ హీరోలందరికీ మంచి కాంబినేషన్ అవుతుంది అని దర్శకులు భావిస్తున్నారు. కన్నడ తో పాటు 2022లో ఒక తమిళ చిత్రంలో కూడా నటించి అక్కడ కూడా మంచి సినిమా అవకాశాలు పొందే ప్రయత్నంలో ఉంది ఆషిక. కన్నడ పరిశ్రమ నుంచి మెల్లిగా సౌత్ ఇండియా వ్యాప్తంగా ఈ అమ్మాయి హవా పెరుగుతుంది. మరి కొన్ని రోజులు ఆగితే తెలుగులో కూడా మరిన్ని మంచి చిత్రాలు నటించే అవకాశం కూడా ఉంది అన్నీ కలిసి వస్తే భవిష్యత్తులో ఫ్యాన్ ఇండియా చిత్రాల్లో కూడా నటిస్తుంది ఈ ఆషిక రంగనాథ్.