దేవర బాటలో కల్కి.. ఫ్యాన్స్ షాక్..!
ఇక దేవర బాటలో ప్రభాస్ కల్కి కూడా రిలీజ్ వాయిదా వేసే ప్లాన్ లో ఉన్నారట. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కల్కి సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మిస్తున్నారు. సినిమాను 500 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ను మే 9న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు సినిమా ఆ టైం కు రిలీజ్ చేయడం కుదరదని అంటున్నారు.
ప్రభాస్ కల్కి సినిమా కూడా భారీ బడ్జెట్ తో వస్తుంది. హడావిడిగా రిలీజ్ చేయడం కన్నా సినిమా అనుకున్నట్టుగా తీయాలనే ప్లాన్ తో వస్తున్నారు. అందుకే రిలీజ్ డేట్ కోసం చుట్టేయకుండా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. కల్కి మే నుంచి వాయిదా పడితే ఆ స్లాట్ లో కూడా మరికొన్ని సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంది. స్టార్ సినిమాలు అనుకున్న డేట్ కి రాకపోవడం వల్ల ఆ టైం కి టైర్ 2 హీరో సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఏప్రిల్, మే లో తారక్, ప్రభాస్ రాకుంటే చిన్న సినిమాలకు పండుగే అని చెప్పొచ్చు. కల్కి పోస్ట్ పోన్ అనౌన్స్ మెంట్ కూడా ఇంకా రాలేదు. రెబల్ స్టార్ ఫ్యాన్స్ దానికోసం ఎదురుచూస్తున్నారు.