హనుమాన్'
సక్సెస్ తో టైర్-2 హీరోల లిస్ట్ లో చేరిపోయాడు
తేజ సజ్జ.
ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ
సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తుంది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అన్నిచోట్ల
హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో అదరగొడుతోంది ఇప్పటికే 200 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డ్ స్థాయిలో వసూలు అందుకుంటున్న ఈ సినిమాలో
తేజ సజ్జా తన యాక్టింగ్ తో అదరగొట్టేసాడు. దీంతో హీరోగా
తేజ సజ్జా కి హనుమాన్ విపరీతమైన పాపులర్ తెచ్చిపెట్టింది. ఈ క్రమంలోనే ఈ యంగ్ హీరోకి ఇప్పుడు వరస అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. హనుమాన్ తర్వాత
తేజ సజ్జా నటించబోయే సినిమాలపై
ఆడియన్స్ లోను మరింత ఆసక్తి నెలకొంది.
ఈ నేపథ్యంలోనే
తేజ సజ్జ నెక్స్ట్
మూవీ పై ఆసక్తికర అప్డేట్ బయటికి వచ్చింది. అదేంటంటే, ప్రముఖ సినిమాటోగ్రాఫర్,
రవితేజ 'ఈగల్' సినిమాతో దర్శకుడిగా మారుతున్న
కార్తీక్ ఘట్టమనేనితో
తేజ సజ్జా తన నెక్స్ట్
మూవీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు డిఫరెంట్ జానర్ లో ఉంటుందని అంటున్నారు. ఇక
కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన 'ఈగల్' ఫిబ్రవరిలో విడుదల కాబోతోంది. ఈ
మూవీ తర్వాత
కార్తీక్ తేజ సజ్జా తో సినిమాని పట్టాలెక్కించనున్నట్లు సమాచారం. మరోవైపు హనుమాన్ సీక్వెల్ కి సంబంధించి ఇటీవల ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైన సంగతి తెలిసిందే. హనుమాన్ ఇంకా థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుండగానే
ప్రశాంత్ వర్మ సీక్వెల్ పై దృష్టి సారించాడు. త్వరలోనే షూటింగ్ కూడా మొదలు కాబోతుంది. 2025 సంక్రాంతికి హనుమాన్ సీక్వెల్ని రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ సీక్వెల్లో
తేజ సజ్జా నేను
హీరో కాదని, సీక్వెల్ లో హనుమంతుడి పాత్ర ప్రధానంగా ఉంటుందని, ఆ పాత్రని
టాలీవుడ్ లో స్టార్
హీరో చేస్తారని రీసెంట్ ఇంటర్వ్యూలో
ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు. సీక్వెల్లో
తేజ సజ్జ పాత్ర కొంతవరకు మాత్రమే ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇక హనుమాన్ విషయానికి వస్తే..
ఇండియన్ సూపర్
హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో
తేజ సజ్జా సరసన
అమృత అయ్యర్ హీరోయిన్గా నటించింది.