అప్పుడే ఓటీటీ లోకి వచ్చేస్తున్న నాగార్జున నా సామిరంగ.. ఎప్పుడంటే..!?

Anilkumar
టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ సినిమా నా సామి రంగా. కొరియోగ్రాఫర్ గా ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న విజయ బిన్నీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల అయింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. కానీ ఆశించిన స్థాయిలో మాత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది. కాగా ఫలితంగా నా సామి రంగా సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్ల పరంగా మాత్రం ఊహించని స్థాయిలో వచ్చింది. అంతేకాదు ఈ సినిమాలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్ ఆశిక రంగనాథ్


రాజ్ తరుణ్ మీర్న మీనన్ వంటి వారు కీలకపాత్రలో కనిపించారు.. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్  పరంగా మాత్రం బెస్ట్ అనిపించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు నా సామి రంగా సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే.. సంక్రాంతికి భారీ లు పోటీ పడ్డాయి. అయినా కూడా వెనక్కి తగ్గకుండా నా సామిరంగ రిలీజ్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ ఓటీటీలో అలరించడానికి రెడీ అవుతుందని తెలుస్తోంది. సంక్రాంతి కి రిలీజ్ అయిన లు ఇప్పటికే తమ ఓటీటీ పార్ట్నర్ లను ఫిక్స్ చేసుకొని రిలీజ్ కు డేట్స్ కూడా ఫిక్స్ చేసుకుంటున్నాయి.


ఈ నేపథ్యంలో నాసామిరంగ కూడా ఓటీటీలోకి రావడానికి రెడీ అవుతుందని తెలుస్తోంది. జనవరి 14న విడుదలైన ఈ సరిగా 45 రోజులకు ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. మార్చ్ సెకండ్ వీక్ లో నాసామిరంగ ఓటీటీలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని హాట్ స్టార్ నాసామిరంగ ఓటీటీ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది. త్వరలోనే డిస్ని హాట్ స్టార్ లో ఈ ను స్ట్రీమింగ్ చేయనున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: