ఫైటర్ రివ్యూ: హాలీవుడ్ రేంజ్.. ప్లస్ పాయింట్స్ ఇవే..?

Purushottham Vinay
బాలీవుడ్‌ స్టార్ హీరో హృతిక్‌ రోషన్‌, దీపికా పదుకొణె జంటగా నటించిన సినిమా ఫైటర్‌.దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ గణతంత్ర దినోత్సవ కానుకగా నేడు అనగా జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.ఈ భారీ యాక్షన్‌ మూవీని సిద్దార్థ్‌ ఆనంద్‌ డైరెక్ట్‌ చేశాడు. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో సాగే మొదటి ఏరియల్‌ యాక్షన్‌ మూవీగా దీన్ని రూపొందించారు.ఫైటర్‌ మూవీ ఎలా వుందో తెలుసుకుందాం.ఈ సినిమా చాలా బాగుంది.ఫైటర్‌ సినిమాను డైరెక్టర్ చాలా బ్రిలియంట్‌గా తెరకెక్కించాడు. సినిమాకు అంతగా బజ్‌ లేకపోడంతో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ పెద్దగా లేవు. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఫైటర్‌ మూవీ ద్వారా హ్యట్రిక్ కొట్టారు. ఈ మూవీలో భారీ యాక్షన్‌ సీన్స్‌తో పాటు డ్రామా, ఎమోషన్స్, దేశభక్తి అన్నీ ఉన్నాయి.ఈ మూవీ ఖచ్చితంగా కింగ్‌ సైజ్‌ బ్లాక్‌ బస్టర్‌.



హృతిక్ రోషన్ 'ఫైటర్' మూవీలో షో టాపర్. దీపికా పదుకోన్‌తో ఆయన కెమిస్ట్రీ సూపర్‌. అనిల్ కపూర్ ఎప్పటిలాగే చాలా అద్భుతంగా నటించారు. సెకండాఫ్ ఫైటర్‌ మూవీకి మరింత బలాన్ని ఇస్తుంది. అలాగే ఈ మూవీలో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించే డైలాగ్స్‌ కూడా ఉన్నాయి. ఈ మూవీలోని బీజీఎమ్‌ సూపర్‌.  గ్రాఫిక్స్‌, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్‌ పనితీరు చాలా బాగుంది.దేశభక్తి ఉన్న ఇలాంటి ఏరియాల్ యాక్షన్‌ను ఇంతవరకు మనం చూడలేదు.హృతిక్ రోషన్ ఫైటర్‌ చిత్రంతో తానేంటో నిరూపించుకున్నాడు. దీపికా పదుకొణె తన కెరీర్‌లో ఈ చిత్రం బెస్ట్‌గా ఉంటుంది.ఇక అనిల్ కపూర్ ఫైటర్‌ సినిమాకు ఆత్మలాంటివాడు. హృతిక్ రోషన్‌కు భారీ కలెక్షన్స్‌ తెచ్చిపెట్టే సినిమా ఇది. గత కొంత కాలం నుంచి వరుస ప్లాపులు ఎదురుకుంటున్న హృతిక్ రోషన్ కి ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కం బ్యాక్ హిట్టుగా నిలిచింది. మూవీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ సూపర్. ఈ మూవీ హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది. ఈ మూవీని థియేటర్లో ఖచ్చితంగా చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: