మ్యాస్ట్రో ఇళయరాజా కుమర్తె మృతి?

Purushottham Vinay
తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ స్టార్ సంగీత దర్శకులు, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా కుమర్తె భవతరణి మరణించారు. లివర్ క్యాన్సర్ తో ఆమె గత కొంత కాలం నుంచి బాధపడుతున్నారు.అందువల్ల సరైన చికిత్స తీసుకునేందుకు ఆమె శ్రీలంక వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలోనే గురువారం(జనవరి 25)న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసి సినీ పరిశ్రమ మెుత్తం కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.ఆమె మంచి సింగర్.తన గొంతు నుంచి ఎంతో మధురమైన పాటలను అందించింది భవతరణి. తన తండ్రి సంగీత దర్శకత్వం వహించిన చాలా సినిమాల్లో కూడా ఆమె అద్భుతమైన పాటలు పాడింది.తన సినీ కెరీర్ లో ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడారు.తన తండ్రి ఇళయరాజా సంగీత దర్శకత్వంతో పాటుగా తన సోదరులు కార్తీక్ రాజా ఇంకా అలాగే యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వంలో కూడా పలు పాటలు పాడారు భవతరణి. తెలుగులో కూడా పాడారు.



గుండెల్లో గోదారి అనే సినిమాలో ఓ పాట పాడారు. ఇక 2000 సంవత్సరంలో వచ్చిన భారతి సినిమాలో 'మైల పోల పొన్ను ఒన్ను' పాటకు గాను ప్లే బ్యాక్ సింగర్ గా ఆమె నేషనల్ అవార్డును అందుకున్నారు. అలాగే ఆమె కేవలం సింగర్ గానే కాకుండా.. ఎన్నో సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా ఆమె పనిచేశారు. భవతారిణి ‘రాసయ్య’ సినిమాతో గాయనిగా అరంగేట్రం చేశారు. ఆమె చివరిగా మలయాళ చిత్రం ‘మాయానది’లో పాడారు. తమిళ సినిమాలు ‘కధలుక్కు మరియాదై’, ‘భారతి’, ‘అళగి’, ‘ఫ్రెండ్స్’, ‘పా’, ‘మంకథ’, ‘అనేగన్’ వంటి సినిమాల్లో ఆమె పాడిన పాటలకు మంచి పేరు వచ్చింది.భవతరణి గారి పార్థీవ దేహాన్ని చెన్నైకి తీసుకొచ్చి.. అక్కడే రేపు(జనవరి 26)న అంత్యక్రియలు జరపనున్నట్లు సమాచారం తెలుస్తుంది. భవతరణి మరణవార్త విని తమిళ చిత్ర పరిశ్రమ అంతా ఒక్కసారిగా దిగ్బ్రాంతికి లోనైంది. ఇళయరాజా గారి కుటుంబానికి తమ ప్రగాఢసానుభూతి తెలుపుతున్నారు సినీ, రాజకీయ ప్రముఖులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: