షాక్: విడాకులపై ఫస్ట్ టైం నిజాన్ని చెప్పేసిన నిహారిక..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా బ్రదర్ నాగబాబు కూతురుగా నిహారిక మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈమె వివాహం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. కానీ వివాహమైన కొన్ని ఏళ్లకే జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకొని ఒక సంచలనాన్ని సృష్టించింది. దీంతో నిహారిక జంటపైన మరెన్నో వార్తలు వినిపించాయి. మొదటిసారి నిహారిక తన పెళ్లి విడాకుల పైన స్పందించినట్లు తెలుస్తోంది. వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు మనం చూద్దాం.

నిహారిక తాజాగా పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ.. వివాహం తర్వాత తాను సినిమాలు చేయలేదు. వివాహం చేసుకున్నందువల్లే సినిమాలు మానేశానని చాలామంది అనుకున్నారు. కానీ మా వదిన లావణ్య కూడా ఇదే ప్రశ్నని చాలామంది అడిగారు.ఇది మా వృత్తి మేమెందుకు దానిని వదిలేస్తామంటూ తెలిపింది నిహారిక.. నిర్మాతగా కాస్త బిజీగా అవ్వడం వల్ల తాను నటనకు దూరమయ్యానని తెలిపింది. అయితే ప్రతి ఒక్కరు కూడా పెళ్లి చేసుకునే ముందు కచ్చితంగా ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడం ముఖ్యము అది తెలియకుండానే మనకు సెట్ అవ్వని వ్యక్తిని వివాహం చేసుకుంటే.. మన ఇంట్లో మనుషుల లాగా ఉండలేరు కదా అంటూ తెలియజేసింది.


అందుకే ఈ మధ్య ఒంటరిగా ఎలా ఉండాలో నేర్చుకున్నానని తెలిపింది నిహారిక..తనది పెద్దలు కుదిరిచిన వివాహమని నన్ను చాలా మాటలు అన్నారు చాలా బాధేసింది ఎన్నో సార్లు ఏడ్చాను ఆ విషయాన్ని కూడా భరించాను ఎవరైనా జీవితాంతం కలిసి ఉండాలనుకునే వివాహం చేసుకుంటారు..కానీ ఏడాదిలోపే విడిపోతున్నామని తెలిసి అంత గ్రాండ్గా ఎవరు వివాహం చేసుకోరు కదా.. రిలేషన్షిప్  కొనసాగాలని అందరము అనుకుంటాము.. నేను కూడా అలాగే అనుకున్నాను కానీ అవి అనుకున్నట్టుగా జరగలేదు నా గురించి ఏం రాసిన అసలు పట్టించుకోనంటూ తెలిపింది.. తన క్యారెక్టర్ ని తప్పుపట్టారు కుటుంబాన్ని దూషించడం జరిగింది..తన కుటుంబానికి తాను ఎప్పుడూ కూడా బరువుకాలేదు.. ఈ రెండేళ్లలో తన కుటుంబం విలువ తనకు బాగా తెలిసిందని తెలిపింది.. పెళ్లి విడాకుల ద్వారా ఎవరిని నమ్మకూడదని విషయం తెలిసిందని ఇది ఒక గుణపాఠం అంటూ తెలిపింది నిహారిక.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: