నటి కామాక్షి భాస్కరాల ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా మా ఊరి పొలిమేర. ఈ సినిమా కంటే ముందు ఈమె ప్రియురాలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, కబూల్ హై, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, విరూపాక్ష లాంటి సినిమాలలో నటించి మెప్పించింది.ఇక తాజాగా వచ్చిన మా ఊరి పొలిమేర 2 సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది కామాక్షి. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కామాక్షి ఎన్నో అంశాల గురించి స్పందించింది. ఈ సందర్భంగా మీనాక్షి భాస్కరాల ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.. కామాక్షి భాస్కర్ల చైనాలో ఎంబీబీఎస్ చేసి అపోలో ఆస్పత్రిలో కొంతకాలం డాక్టరుగా పనిచేసిందట.ఆ తరువాత ఆమె మోడల్ రంగంలో అడుగుపెట్టి 2018 ఏడాదికి గాను మిస్ తెలంగాణగా ఎంపికైంది. 2018 మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనల్స్ వరకు చేరుకుంది.
అయితే ఈమె వైద్యురాలు కాగా తాను ఏది చెప్పినా తాను ఏదైమా మంచి చేయాలనుకున్నా తాను చెప్పేదంతా వినాలంటే తాను ఒక స్టార్ కావాలని అనుకుని మాడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిందట. అలాగే తనకు ఏమీ తెలియకపోయినా యూట్యూబ్ లో పలు వీడియోలు, ఇంటర్వ్యూలు చూస్తూ మోడలింగ్ గురించి తెలుసుకున్నట్లు కూడా వెల్లడించింది. అలాగే మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనడానికి తాను పడ్డ కష్టాన్ని అంతా వివరించింది. తాను మోడల్ గా చేస్తానని చెబితే తండ్రి డబ్బులు ఇవ్వనని తెగేసి చెప్పారట. ఇంత కష్టపడి చదివిస్తే మరేదో చేయడాన్ని తాను ఒప్పుకోలేదని.. దీంతో ఆమె తన సాయంత్రం ఉద్యోగం చేస్తూనే మోడలింగ్ చేయాలని ఫిక్స్ అయి ఉదయం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు పడే కష్టం గురించి వివరించింది.
అయితే అంతా కష్టపడి తాను మిస్ ఇండియా ఫైనల్స్ కు చేరుకోగా టాప్ 3లో నిలిచానని చెప్పుకొచ్చింది. కానీ టాప్ 1లోకి వచ్చేందుకు తాను ఇంకా చాలా సన్నబడాలని ఒక జడ్డి చెప్పినట్లు తెలిపింది. కానీ తనకు అది నచ్చలేదని.. నిజానికి తన హైట్ కు తన వెయిట్ కరెక్ట్ అని ఇతర దేశాల వాళ్లతో తన బాడీ మ్యాచ్ కాదని చెప్పుకొచ్చింది.ఆమె అలా చెప్పగానే, నాకు ఆ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. అదేదో పెద్ద మాఫియా అలా అనిపించింది అంటూ ఆమె సంచలన వాఖ్యలు చేసింది. బ్యూటీ అంటే మనలోని అందాన్ని మెరుగు పరిచి చూయించాలే తప్ప ఏవేవో సర్జరీలు, హెల్త్ పాడు చేసుకోవడం వంటివి నాకు నచ్చలేదు అని చెప్పుకొచ్చింది మీనాక్షి.