టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇకపోతే గతంలో విజయ్ ... పరుశురామ్ కాంబోలో గీత గోవిందం అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ రూపొంది అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
దానితో వీరి కాంబోలో రూపొందుతున్న రెండవ సినిమా కావడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాను చాలా రోజుల క్రితం ఈ మూవీ బృందం ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కానీ ఈ మూవీ షూటింగ్ చాలా పెండింగ్ ఉండడంతో ఈ మూవీ ని సంక్రాంతి బారి నుండి ఈ మూవీ బృందం తప్పించింది. ఇకపోతే ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ విడుదల తేదీని ఈ మూవీ బృందం ప్రకటించలేదు.
ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని ఈ చిత్ర బృందం ఈ సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరో కొన్ని రోజుల్లో ఈ మూవీ బృందం విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది.