ఆదిపురుష్ సినిమాలో ఆ సీన్స్ అస్సలు నచ్చలేదు.. ప్రశాంత్ వర్మ..!

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా కలెక్షన్ల పరంగా భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే తగ్గగా ఇదే విషయంపై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు హనుమాన్ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ. ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమాలోని కొన్ని సన్నివేశాలు చాలా బాగా నచ్చాయి అని.. కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం అంతగా ఆకట్టుకోలేక పోయాయి అని.. నేనైతే ఈ వాటిని చాలా అద్భుతంగా తీర్చిదిద్దేవాడిని అని ఒకానొక ఇంటర్వ్యూలో వెల్లడించాడు హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ.


దీంతో ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఒక జాతీయ మీడియాతో మాట్లాడాడు ప్రశాంత్ వర్మ.. ఇందులో భాగంగానే ఆది పురుష్ సినిమాలోని కొన్ని సీన్స్ చూసి షాక్ అయ్యాను అని.. అంత అద్భుతంగా ఉన్నాయి అని.. కొన్ని సన్నివేశాలను మాత్రం తీర్చిదిద్దిన విధానం నాకు నచ్చలేదు అని తెలియజేశాడు. నేనే గనుక ఆ సినిమా తీసి ఉంటే.. ఆ సన్నివేశాలను బాగా చేసేవాడిని కదా అనిపించింది. నాకే కాదు.. ఏ ఫిల్మ్‌ మేకర్‌కి అయినా అలాంటి భావన కలుగుతుంది. ఆ సినిమా ఫలితం నాపై ఎలాంటి ప్రభావం చూపించలేదు.


నా టీమ్‌ సపోర్ట్‌ని 'హను-మాన్‌'ని అనుకున్న విధంగా తీర్చిదిద్దగలిగాం'అని ప్రశాంత్‌ వర్మ అన్నారు. హను-మాన్‌'విషయాకొస్తే.. తేజా సజ్జా, అమృతా అయ్యర్‌ జంటగా నటించిన చిత్రమిది. వరలక్ష్మీ శరత్‌కుమార్‌, వినయ్‌రాయ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదలైన ఈ చిత్రం.. తొలి రోజు నుంచే హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 250 కోట్ల వరకు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇక వచ్చే ఏడాది ఈ సినిమాకు సీక్వెల్‌ 'జై హనుమాన్‌' రిలీజ్‌ కాబోతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: