టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కాంబోలో వచ్చిన యానిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో కాంట్రవర్సీలు కూడా అన్నే క్రియేట్ చేస్తుంది.ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ.. 2023 సంవత్సరంలోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ చిత్రాల్లో జవాన్, పఠాన్ తరువాత స్థానాల్లో నిలిచింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే ఓ రేంజ్ లో మోత మోగిపోయింది.ఈ మూవీలోని బీజీఎమ్, సాంగ్స్, సీన్స్, మీమ్స్, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం కూడా ఆడియన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. ఎట్టకేలకు జనవరి 26 అర్ధరాత్రి నుంచి యానిమల్ ను స్ట్రీమింగ్ చేసింది ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందీ యానిమల్ సినిమా.నిజానికి థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక రకాల విమర్శలు వస్తూనే ఉన్నాయి. మహిళలను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఈ మూవీలో ఉన్నాయంటూ పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా తప్పుపట్టారు. ఈ సినిమా.. మహిళలు పట్ల ద్వేషాన్ని పెంపొందించేలా ఉందంటూ పలు సందర్భాల్లో కొందరు విమర్శించారు.తాజాగా ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ అయ్యాక కొందరు మేకర్స్ పై ఫైర్ అవుతున్నారు.
ఇలాంటి సినిమాలను ఎలా ప్రసారం చేస్తారని నెట్ఫ్లిక్స్ నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ ఆపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే వీటికి యానిమల్ మూవీ ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. అసలు ఈ సినిమాకు ఏమైంది? నచ్చకపోతే చూడడం మానేయాలి? అంతేగానీ సినిమాను ఎలా తీసేమంటారని కౌంటర్ ఇస్తున్నారు. ముఖ్యంగా తమిళ ఆడియన్స్ ఈ సినిమాపై నెగటివిటీ పెంచుతున్నారు.తమిళ నటి రాధిక కూడా X ద్వారా ఈ మూవీ చెత్త మూవీ అని మండిపడింది. తమిళ నెటిజన్స్ అయితే ఈ సినిమాని పొన్నియిన్ సెల్వన్ సినిమాతో పోల్చి తెలుగు మేకర్స్ కంటే తమిళ మేకర్స్ చాలా బెటర్ పొన్నియిన్ సెల్వన్ లాంటి సినిమాలు తీస్తూ మంచి పేరు తెచ్చుకుందని తమ తమిళ ఇండస్ట్రీని లేపుతున్నారు.నిజానికి తెలుగులో కంటే తమిళంలోనే గతంలో చెత్త సినిమాలు వచ్చాయి. బాయ్స్, మన్మధ లాంటి సినిమాలు అమ్మాయిలని కించపరిచేలా తీశారు. ఇంకా చాలా సినిమాలు కూడా ఉన్నాయి. మరి వాటితో పోల్చుకుంటే యానిమల్ ఏ పాటిదో వారికే తెలియాలి.