మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం బీమా అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం ఒక చిన్న వీడియోని విడుదల చేయగా అది అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ మూవీ పై గోపీచంద్ తో అభిమానులతో పాటు మామూలు తెలుగు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.
ఇకపోతే తాజాగా ఈ మూవీ.కి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క విడుదల తేదీని ప్రకటించారు. ఈ మూవీ ని ఈ సంవత్సరం మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ లో గోపీచంద్ పోలీస్ యూనిఫామ్ వేసుకొని అదిరిపోయే స్టైలిష్ లుక్ లో నడుచుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.
ఇకపోతే ప్రస్తుతం గోపీచంద్ ఈ మూవీ తో పాటు శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో కూడా హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి కాబోతోంది. అలాగే ఈ మూవీ విడుదల తేదీని కూడా ఈ చిత్ర బృందం మరికొన్ని రోజుల్లోనే విడుదల చేసే అవకాశం ఉంది. ఇలా గోపీచంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు.