గౌతమ్ తిన్ననూరి "మ్యాజిక్" మూవీకి సంబంధించిన క్రేజీ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో గౌతమ్ తిన్ననూరి ఒకరు. ఈయన సుమంత్ హీరోగా రూపొందిన మళ్లీ రావా మూవీ తో దర్శకుడుగా తన కెరీర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈయన నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా రూపొందినటువంటి జెర్సీ సినిమాకు దర్శకత్వం వహించాడుఎం ఈ మూవీ సూపర్ సక్సెస్ సాధించడంతో దర్శకుడిగా ఈయన క్రేజ్ తెలుగు పరిశ్రమలో అమాంతం పెరిగి పోయింది. ఆ తర్వాత ఈయన ఇదే సినిమాని జెర్సీ అనే టైటిల్ తోనే షాహిద్ కపూర్ హీరో గా హిందీ లో రూపొందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా హిందీ ప్రేక్షకులను అలరించడంలో కాస్త విఫలం అయింది.


ఇకపోతే ఈ సినిమా తర్వాత ఈయన విజయ్ దేవరకొండ హీరో గా ఓ మూవీ ని రూపొందించనున్నట్లు ప్రకటించాడు. కానీ విజయ్ , పరుశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ స్టార్ సినిమా షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉండడంతో ఆ లోపు గౌతమ్ "మ్యాజిక్" అనే ఓ చిన్న సినిమాని కంప్లీట్ చేశాడు. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేసింది. అలాగే ఈ మూవీ కి సంబంధించిన కొన్ని వివరాలను కూడా ఈ మూవీ మేకర్స్ విడుదల చేశారు. అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని క్రేజీ వివరాలను తెలుసుకుందాం.


ఈ మూవీ లో సారా అర్జున్ ముఖ్య పాత్రలో నటించగా ... గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అనిరుద్ ఈ మూవీ కి సంగీతం అందించగా ... సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించారు. గిరీష్ గంగాధరన్ ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయగా ... నవీన్ నోలి ఈ సినిమాకు ఎడిటర్ గా వర్క్ చేశాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సమ్మర్ లో తెలుగు , తమిళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి చాలా తక్కువ కాలం లో రూపొందించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ ను చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: