మేకింగ్ స్టిల్స్ తో ఫ్యాన్స్ ను టెన్షన్ పెట్టిన అనుపమ పరమేశ్వరన్....!!

murali krishna
తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న హీరోయిన్స్ లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ఆమెకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది అనడంలో ఆశ్చర్యం లేదు..అందాల బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కు పెళ్లి అయిపోయిందా.. ? ఏంటి..? నిజమా .. అని కంగారుపడకండి. అనుపమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తెలుగు, తమిళ్, మలయాళం అని తేడా లేకుండా వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఈ చిన్నదాని చేతిలో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి. ఈగల్, టిల్లు స్క్వేర్ .. ఈ రెండు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇక ఇవే కాకుండా తమిళ్ లో జయం రవి సరసన సైరెన్ సినిమాలో నటిస్తుంది. సినిమాలే కాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. అభిమానులను అలరిస్తూ ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో పాటు.. తన సినిమాలోని క్యారెక్టర్స్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. ఫన్నీ ఫన్నీ క్యాప్షన్స్ ఇస్తూ ఉంటుంది.తాజాగా ఈ చిన్నది పెళ్లికూతురుగా మారిపోయింది. పట్టుచీర, ఒంటినిండా నగలు.. మెడలో తాళిని చూపిస్తూ కనిపించింది. దీంతో ఫ్యాన్స్ సడెన్ గా చూసి.. అనుపమ పరమేశ్వరన్ కు పెళ్లి అయిపోయిందా.. ? అంటూ ఫీల్ అయిపోతున్నారు. కానీ, అది నిజం పెళ్లి కాదు. ఆమె నటించిన సైరెన్ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. అందులో అనుపమ , జయం రవిని పెళ్లి చేసుకుంటుంది. ఆ సాంగ్ లోని మేకింగ్ స్టిల్స్ నే ఈ చిన్నది షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. హమ్మయ్య సినిమాలో స్టిల్సా.. నిజంగానే పెళ్లి అయిపోయిందని భయపడ్డామని చెప్పుకొస్తున్నారు. ఆమె డై హార్డ్ ఫ్యాన్స్ మాత్రం ఎప్పటిలానే అల్లం, బెల్లం.. అనుపమ నా పెళ్ళాం అని కామెంట్స్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: