పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబోలో సినిమా ఫిక్స్.. ఎప్పుడంటే..!?

Anilkumar
సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు డైరెక్టర్లు ఉన్నప్పటికీ కొన్ని కాంబినేషన్లో సినిమాలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి కాంబినేషన్లలో జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ సుకుమార్ త్రివిక్రమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి. కానీ ఆజ్ఞాతవాసి సినిమా మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. అయినప్పటికీ మంత్రి కాంబినేషన్లో మళ్ళీ సినిమా వస్తే బాగుంటుంది అని ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. దానికి తగ్గట్టుగానే చాలా సంవత్సరాల నుండి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అని అంటున్నారు.

కానీ ఇప్పటివరకు రాలేదు ఈ క్రమంలోనే ఎందుకు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావట్లేదు అన్న విషయం తెరపైకి వచ్చింది. అయితే త్రివిక్రమ్ ప్రస్తుతం వరుస సినిమాలకి కమిట్ అవ్వడమే ఎందుకో కారణమని అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ప్రస్తుతం సినిమా చేసే అవకాశం ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కి రాలేదు అని అంటున్నారు. మరి ఇందులో భాగంగానే ఎప్పుడు కాంబినేషన్లో సినిమా వస్తుంది అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ మళ్ళీ సినిమా సెట్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ తర్వాత ముందుగా కమిట్ అయిన సినిమాలన్నింటిని కంప్లీట్ చేస్తాడు.

ఆలోపు త్రివిక్రమ్ కమిట్ అయిన అల్లు అర్జున్ సినిమా చేస్తాడు. ఇక దాని తర్వాత వీళ్ళిద్దరి కాంబో లో ఒక భారీ సినిమా రాబోతున్నారు గా తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ ఎప్పుడు సినిమా చేస్తాడా చూడాలి అనే ఉద్దేశ్యం లోనే ఉన్నారు. ప్రతి ఈవెంట్ లో కూడా త్రివిక్రమ్ కనిపించిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ తో సినిమా ఎప్పుడు అంటూ అభిమానులు విపరీతమైన గోల చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే త్రివిక్రమ్ పాన్ ఇండియా కథను కూడా పవన్ కళ్యాణ్ కోసం రెడీ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో త్రివిక్రమ్ ఎంతవరకు తన సత్తాని చూపిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: