తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత క్రేజ్ కలిగిన యువ నటి మనులలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటి వరకు చాలా తెలుగు సినిమా లలో నటించి అందులో అనేక మూవీ లతో అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఈమె తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో చాలా వరకు పద్ధతి గల అమ్మాయి పాత్రల్లో ... చాలా డీసెంట్ పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది.
ఇలా డీసెంట్ పాత్రలతోనే ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన ఈమె కొంత కాలం క్రితం రౌడీ బాయ్స్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో మొదటి సారి ఈ బ్యూటీ లిప్ లాక్ సన్నివేశాల్లో పాల్గొంది. ఈ సన్నివేశాలతో ఈ బ్యూటీ కుర్ర కారుకు మంచి కిక్ ను ఎక్కించినప్పటికీ ఈమెను క్లాస్ పాత్రలలో చూసి ఇష్ట పడిన వారు మాత్రం ఈ సినిమాలోని ఈమె నటనకు కాస్త ఇబ్బంది పడ్డారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ చాలా బోల్డ్ పాత్రలోనే నటిస్తూ వస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈమె టిల్లు స్క్వేర్ అనే మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది.
ఇందులో కూడా ఈమె తన అందాలను భారీగానే ఆరబోసినట్లు తెలుస్తోంది. ఇకపోతే అనుపమ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న సారీ ని కట్టుకొని అంతే క్లాస్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ నటి కి సంబంధించిన ఈ క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.