టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా రూపొందిన నా సామి రంగ అనే సినిమా జనవరి 14 వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఇప్పటి వరకు 15 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 15 రోజుల్లో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసింది అనే వివరాలను తెలుసుకుందాం.
ఈ మూవీ 15 రోజుల్లో నైజాం ఏరియాలో 4.97 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా , సిడెడ్ ఏరియాలో 3.76 కోట్లు , ఉత్తరాంధ్రలో 3.65 కోట్లు , ఇస్ట్ లో 2.72 కోట్లు , వెస్టు లో 1.34 కోట్లు , గుంటూరు లో 1.53 కోట్లు , కృష్ణ లో 1.29 కోట్లు , నెల్లూరు లో 88 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా 15 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 20.14 కోట్ల షేర్ , 33.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ మూవీ 15 రోజుల్లో కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 78 లక్షల కలెక్షన్ లను వసూలు చేయగా , ఓవర్ సీస్ లో 62 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.
మొత్తంగా ఈ సినిమా 15 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 21.54 కోట్ల షేర్ , 37.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 18.20 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఈ మూవీ 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారి లోకి దిగింది. ఇకపోతే ఈ మూవీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా 2.54 కోట్ల రేంజ్ లో లాభాలను అందుకుంది. ఈ మూవీ లో తెలుగు సినీ పరిశ్రమంలో మంచి గుర్తింపు కలిగిన నటులు అయినటువంటి అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ కీలక పాత్రలలో నటించగా ... ఆషిక రంగనాథ్ ఈ మూవీ లో నాగార్జున కు జోడి గా నటించింది. ప్రముఖ డాన్స్ కొరియో గ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.