టాలీవుడ్ లో టాప్ 1-8 సంక్రాంతికి అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాలివే..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలకు ఏదైనా పండుగ చాలా స్పెషల్ గా ఉంటుంది. ఎందుకంటే ఆ పండుగకు సినిమాలు విడుదల చేసి మంచి విజయాలను అందుకునే విధంగా ప్లాన్ చేస్తూ ఉంటారు. అలా ఇప్పటి వరకు సంక్రాంతికి వచ్చిన కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ గా విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

మొదట డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబినేషన్లో వచ్చిన హనుమాన్ సినిమా రూ.265 కోట్ల రూపాయలతో ఇంకా హౌస్ఫుల్ తో ముందుకు వెళ్తోంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అలా వైకుంఠపురం సినిమా రూ .260 కోట్ల రూపాయలను రాబట్టింది. అలాగే చిరంజీవి డైరెక్టర్ బాబి కాంబినేషన్లో వచ్చిన వాల్తేర్ వీరయ్య సినిమా కూడా రూ .230 కోట్ల రూపాయలను రాబట్టింది. మహేష్ బాబు డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా రూ .220 కోట్ల రూపాయలను రాబట్టింది. త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం సినిమా రూ .176 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

చిరంజీవి వివి వినాయక్ కాంబినేషన్లో వచ్చిన ఖైదీ నెంబర్-150 సినిమా రూ .165 కోట్ల రూపాయలు క్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. వెంకటేష్, వరుణ్ తేజ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన F-2 సినిమా రూ .130 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన వీర సింహారెడ్డి సినిమా రూ .127 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.. అయితే ఈ సినిమాలన్నీ కూడా 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టిన చిత్రాలుగా ఈ లిస్టుని రిలీజ్  చిత్రాలుగా గుర్తించబడ్డాయి. మరి రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు కూడా ఇందులో చేరబోతున్నాయి.. ప్రతి ఏడాది సంక్రాంతి కూడా చాలామంది హీరోలు సైతం తమ సినిమాలను విడుదల చేసి తమ హవా కొనసాగించాలని చూస్తున్నారు. ఇప్పటికే వచ్చేయేడాదికి కూడా తమ సినిమాలను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: