సుమ , రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల తాజాగా "బబుల్ గమ్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మానస చౌదరి , హర్ష వర్ధన్ , అను హాసన్ తదితరులు ముఖ్య పాత్రలలో నటించగా ... మహేశ్వరి మూవీస్ ... పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారు ఈ సినిమాని నిర్మించారు. రవికాంత్ పేరేపు ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ... శ్రీ చరణ్ పాకాల ఈ మూవీ కి సంగీతం అందించాడు. సురేష్ రగుతు ఈ మూవీ కి సినిమాటో గ్రఫీ చేయగా ... ఈ మూవీ మంచి అంచనాల నడుమ 2023 డిసెంబర్ 29 తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది.
దానితో ఈ మూవీ కి భారీ కలెక్షన్ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశ పరిచిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా ఈ సినిమాని ఫిబ్రవరి 9 వ తేదీ నుండి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. మరి థియేటర్ ప్రేక్షకులను నిరాశ పరిచిన ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.