విశ్వంభర: బాస్ రికార్డులు పక్కా?

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఇంకా యంగ్ డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా విశ్వంభర. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో మెగాస్టార్ జాయిన్ అవ్వడం జరిగింది.తాజాగా దానికి సంబంధించి చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి జాయిన్స్ అంటూ విశ్వంభర కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. అగ్ని గోళం..కారు మబ్బుల మధ్య మెగాస్టార్ చిరంజీవి మాయా లోకంలోకి అడుగు పెడుతున్న పోస్టర్ ని రిలీజ్ చేసి ఈ విషయాన్ని చెప్పేసారు.దీంతో నేటి నుంచి చిరంజీవి సెట్స్ కి హాజరు కానున్నారని సమాచారం తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ లో కొన్ని భారీ సెట్లని కూడా సిద్దం చేసి పెట్టారు. చిరంజీవి సహా ప్రధాన తారగణంపై కీలక సన్నివేశాలు షూట్ చెయ్యాల్సిన నేపథ్యంలో కోట్ల రూపాయలు వెచ్చించి ఏకంగా 13 రకాల సెట్లు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఇది సోషియా ఫాంటసీ సినిమా కావడంతో మేజర్ పార్ట్ షూటింగ్ అంతా అక్కడే జరుగుతుందని సమాచారం తెలుస్తుంది.ఇక ఈ సెట్స్ వదిలి బయట లొకేషన్లో షూటింగ్ ఉండకపోవచ్చు.



అందుకే మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ కంటే ముందే మారుడుమిల్లి అటవీ ప్రాంతంలో తొలి షెడ్యూల్ ముగించారు. వాటిలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొనలేదు. అవన్నీ చిరంజీవి లేని షాట్స్ అని తెలుస్తోంది. మొదట చిరు కూడా కొన్ని సన్నివేశాల కోసం మారుడుమిల్లి షూట్ లో పాల్గొన్నారని ప్రచారం సాగింది గానీ అదంతా అవాస్తవమని సమాచారం తెలుస్తోంది.మెగాస్టార్ చిరంజీవి జాయిన్స్ అని పోస్టర్ వేయడంతోనే ఈ విషయాన్ని కన్పమ్ చేయాల్సి వస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి భీమవరం దొరబాబు పాత్ర పోషిస్తున్నట్లు ఇప్పటికే లీకులందుతున్నాయి. ఆ పాత్రకి జోడీగా ఇద్దరు నాయికలు ఉంటారని సమాచారం తెలిసింది. ఆ మూడు పాత్రల మధ్య రొమాంటిక్ సన్నివే శాలు...నవ్వు తెప్పించే సన్నివేశా లుంటాయని సమాచారం తెలుస్తుంది. ఇక ఈ సినిమాని 2025 జనవరి 10 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఒకవేళ ఈ సినిమా ఖచ్చితంగా అప్పుడు రిలీజ్ అయితే ఈ సినిమాకి వారం లాంగ్ వీకెండ్ దొరుకుతుంది. ఖచ్చితంగా బాస్ రికార్డులు క్రియేట్ చెయ్యడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: